IPL 2025: ధోనీతోనే ఆటలా.. సూర్య బాటలో సాల్ట్.. అంతా రెప్పపాటులోనే జరిగిపోయింది.. వీడియో వైరల్
43ఏళ్ల వయసులోనూ మైదానంలో కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని చురుకుదనం చూపిస్తున్న ధోనీ.. మరోసారి ఐపీఎల్ వీక్షకులను ఆశ్చర్యపర్చాడు.

MS dhoni stumping (Courtesy BCCI)
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి ఐపీఎల్ వీక్షకులను ఆశ్చర్యపర్చాడు. 43ఏళ్ల వయసులోనూ మైదానంలో కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని చురుకుదనం చూపిస్తున్న ధోనీ.. మరోసారి తన మార్కు స్టంపింగ్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనకాల ఉన్నాడంటే బ్యాటర్లు క్రీజు వదిలి ముందుకెళ్లి ఆడేందుకు ఏమాత్రం సాహసించరు. ఒకవేళ ఏ బ్యాటరైనా అత్యుత్సాహం ప్రదర్శించినా వారు పెవిలియన్ బాట పట్టడం ఖాయమని మరోసారి ధోనీ నిరూపించాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన తొలి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను మెరుపు స్టంపౌట్ చేసి పెవిలియన్ కు పంపించాడు ధోనీ. కేవలం 12 సెకండ్ల వ్యవధిలోనే సూర్యను స్టంప్ ఔట్ చేశాడు. దీంతో సూర్య వెనక్కు చూడకుండా పెవిలియన్ బాటపట్టాడు. తాజాగా.. ఆర్సీబీ బ్యాటర్ ను ధోనీ మెరుపు స్టంపౌట్ చేశాడు.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన మార్కు స్టంపింగ్ తో ఐపీఎల్ వీక్షకులను ఆశ్చర్యపర్చాడు. ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్ క్రీజులో ఉన్నాడు. చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ బౌలింగ్ చేస్తున్నాడు. బంతిని ఫ్రంట్ ఫుట్ మీద ఆడేందుకు సాల్ట్ కాలు కొంచెం ముందుకు కదిపి వెంటనే క్రీజులో పెట్టేశాడు. ఇదంతా రెప్పపాటు వ్యవధిలోనే జరిగింది. కానీ, అంత తక్కువ సమయంలోనే ధోనీ సాల్ట్ ను స్టంపింగ్ చేశాడు.
IMAGINE THIS LEVEL OF SPEED WHEN YOU’RE 43 YEAR OLD. 🥶
– MS Dhoni, the greatest behind the stumps! pic.twitter.com/WTSU73psBh
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2025
అయితే, సాల్ట్ తాను నాటౌట్ అన్నట్లుగా నవ్వుతూ కనిపించాడు. కానీ, రీప్లేలో ధోనీ మెరుపు స్టంపింగ్ తో ఔట్ చేసిన విధానాన్ని చూసి అందరిలానే తాను కూడా షాకై పెవిలియన్ బాటపట్టాడు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఆర్సీబీ బ్యాటర్ సాల్ట్ ను ధోనీ స్టంపౌట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘ధోనీ వికెట్ల వెనకాల ఉంటే క్రీజు వదలకండి భయ్యా’’ అంటూ బ్యాటర్లకు సూచనలు చేస్తున్నారు.
2️⃣ moments of magic 2️⃣ ultra fast stumpings ⚡
Which one did you enjoy the most? 🤔
Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB pic.twitter.com/SxPcEphB6Y
— IndianPremierLeague (@IPL) March 28, 2025