IPL 2025: అప్పట్లో రాహుల్ ద్రవిడ్.. ఇప్పుడు రజత్ పాటిదార్.. ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 17ఏళ్ల తరువాత చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించింది.

Courtesy BCCI
IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ జట్టు (RCB) 17ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదు కెప్టెన్లకు సాధ్యంకాని విజయాన్ని ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సాధించాడు. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 17ఏళ్ల తరువాత ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. మామూలు విజయం కాదు.. 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆర్సీబీ వర్సెస్ సీఎస్ కే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ 51 పరుగులు చేశాడు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. చివరికి నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే సీఎస్ కే జట్టు చేయగలిగింది. దీంతో 50 పరుగుల తేడాతో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది.
ఆర్సీబీ జట్టు 17ఏళ్ల తరువాత చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించింది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008లో మే21వ తేదీన చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అప్పట్లో ఆర్సీబీ కెప్టెన్ గా రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. ఆ సమయంలో ఆర్సీబీ జట్టు 14 పరుగుల తేడాతో సీఎస్కే జట్టుపై విజయం సాధించింది. ఆ తరువాత 2010 ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలుస్తూ వస్తుంది. తాజాగా.. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించి 17ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే, ఇప్పటి వరకు చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే జట్లు మొత్తం 10 సార్లు తలపడగా.. సీఎస్కే 8, ఆర్సీబీ 2 సార్లు విజయం సాధించాయి.
– RCB won in Kolkata.
– RCB won in Chennai.
A REMARKABLE START TO CAPTAIN CAPTAIN RAJAT PATIDAR ERA. 🔥pic.twitter.com/varZTYFQlN
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2025
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ జట్టుకు రజత్ పాటిదార్ ఏడో కెప్టెన్. ఆర్సీబీ తొలి కెప్టెన్ గా రాహుల్ ద్రవిడ్ కొనసాగాడు. అప్పట్లో చెపాక్ లో సీఎస్కే జట్టుపై రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు విజేతగా నిలిచింది. ఆ తరువాత కెవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డేనియల్ వెట్టోరి, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలో చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టే విజేతగా నిలుస్తూ వస్తుంది. తాజాగా.. ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో 17ఏళ్ల తరువాత చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టుపై ఆర్సీబీ విజేతగా నిలిచింది.
ఇదిలాఉంటే.. 2025 సీజన్లో ఆర్సీబీ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ విజేతగా నిలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
Gives it more than he takes it. Just Kohli things. 🤷♂️
pic.twitter.com/sA3E5chdJY— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025