IPL 2025: చెపాక్‌లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. 12ఏళ్ల రికార్డు బద్దలు.. కోహ్లీ తరువాత అతనే

చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై అర్ధ సెంచరీ సాధించడం ద్వారా రజత్ పాటిదార్ ఆర్సీబీ కెప్టెన్ గా..

IPL 2025: చెపాక్‌లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. 12ఏళ్ల రికార్డు బద్దలు.. కోహ్లీ తరువాత అతనే

Rajat patidar with Virat Kohli (Courtesy BCCI )

Updated On : March 29, 2025 / 7:17 AM IST

IPL 2025: ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: IPL 2025 : చెన్నైని చిత్తు చేసిన బెంగళూరు.. సొంత గడ్డపై ఘోర పరాజయం..

2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో సీఎస్కే జట్టుపై రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. ఆ తరువాత ఇప్పటి వరకు చెపాక్ స్టేడియంలో సీఎస్కే జట్టుపై ఆర్సీబీ విజయం సాధించలేదు. తాజాగా.. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో 17ఏళ్ల తరువాత రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు చెన్నై పై విజయం సాధించింది.

Also Read: Nicholas Pooran : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై 26 బంతుల్లో 70 ప‌రుగులు.. క్ష‌మించండి.. మ‌రోసారి ఈ త‌ప్పు చేయ‌నన్న నికోల‌స్ పూర‌న్‌..

మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ పై అర్ధ సెంచరీ సాధించడం ద్వారా రజత్ పాటిదార్ ఆర్సీబీ కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. చెపాక్ స్టేడియంలో సీఎస్కే పై అర్ధ సెంచరీ సాధించిన ఆర్సీబీ జట్టుకు రెండో కెప్టెన్ గా పాటిదార్ నిలిచాడు. తద్వారా విరాట్ కోహ్లీ 12ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

 

చెపాక్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ 32 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. 2013 ఏప్రిల్ 13వ తేదీన చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో అప్పటి ఆర్సీబీ కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ (47బంతుల్లో 58 పరుగులు) అర్థ సెంచరీ చేశాడు. 2012లోనూ చెపాక్ లో సీఎస్కే పై విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేసినప్పటికీ ఆర్సీబీ కెప్టెన్ గా డేనియల్ వెట్టోరి ఉన్నాడు.