IPL 2025 : చెన్నైని చిత్తు చేసిన బెంగళూరు.. సొంత గడ్డపై ఘోర పరాజయం..

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది.

IPL 2025 : చెన్నైని చిత్తు చేసిన బెంగళూరు.. సొంత గడ్డపై ఘోర పరాజయం..

Courtesy BCCI

Updated On : March 29, 2025 / 12:28 AM IST

IPL 2025 : ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో చెన్నైని చిత్తు చేసింది బెంగళూరు. 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై ఘోర పరాజయాన్ని చవి చూసింది సీఎస్కే. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది.

అనంతరం 197 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. జోష్ హేజిల్ వుడ్ 3 వికెట్లు, యశ్ దయాల్, లివింగ్ స్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సీఎస్కే జట్టు రచిన్ రవీంద్ర ఒక్కడే 41 పరుగులతో రాణించాడు.

Also Read : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై 26 బంతుల్లో 70 ప‌రుగులు.. క్ష‌మించండి.. మ‌రోసారి ఈ త‌ప్పు చేయ‌నన్న నికోల‌స్ పూర‌న్‌..

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్కేకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. 4.4 ఓవర్లలో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి(5), కెప్టెన్ రుతురాజ్(0), దీపక్ హుడా(4) ఔటయ్యారు. జోస్ హేజిల్ వుడ్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి సీఎస్కేని దెబ్బకొట్టాడు.