Nicholas Pooran : సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 26 బంతుల్లో 70 పరుగులు.. క్షమించండి.. మరోసారి ఈ తప్పు చేయనన్న నికోలస్ పూరన్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో దంచికొట్టినప్పటికి కూడా నికోలస్ పూరన్ క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

pic credit @ ani
గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. ట్రావిస్ హెడ్ (47), అనికేత్ వర్మ (36), నితీశ్ కుమార్ రెడ్డి (32) లు హెన్రిచ్ క్లాసెన్ (26) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (0)లు విఫలం అయ్యారు. కెప్టెన్ కమిన్స్ ఆఖర్లో 4 బంతుల్లో మూడు సిక్సర్లు బాది 18 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీసి ఎస్ఆర్‌హెచ్ పతనాన్ని శాసించాడు.
అనంతరం నికోలస్ పూరన్ (70; 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (52; 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేయగా, అబ్దుల్ సమద్ (22 నాటౌట్; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడడంతో లక్ష్యాన్ని లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
క్షమాపణలు చెప్పిన నికోలస్ పూరన్..
కాగా.. ఈ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో తన జట్టును గెలిపించినప్పటికి కూడా నికోలస్ పూరన్ తన సహచరుడు రవి బిష్ణోయ్‌కి క్షమాపణలు చెప్పాడు. ట్రావిస్ హెడ్ క్యాచ్‌ను వదిలివేసినందుకు పూరన్ సారీ చెప్పాడు.
Ravichandran Ashwin : ఐపీఎల్ అవార్డులను ఎగతాళి చేసిన అశ్విన్..! ఆ రోజు ఎంతో దూరంలో లేదు..
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 27, 2025
హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌ను రవిబిష్ణోయ్ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతికి హెడ్ భారీ షాట్ కు యత్నించాడు. అయితే.. బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచింది. స్ట్రెయిట్‌గా నిలబడ పూరన్ వెనక్కి పరిగెత్తుకుంటూ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. బంతి అతడి చేతుల్లోంచి జారీ కిందపడిపోయింది.
అప్పుడు హెడ్ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆడుతున్నాడు. తనకు లైఫ్ లభించినప్పటికి హెడ్ దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
Because 70(26) was not a good enough apology for Bishi 😅 pic.twitter.com/vFfJCmG97E
— Lucknow Super Giants (@LucknowIPL) March 28, 2025
కాగా.. మ్యాచ్ అనంతరం లక్నో జట్టు తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో హెడ్ క్యాచ్ మిస్ చేసినందుకు బిష్ణోయ్‌కి నికోలస్ పూరన్ క్షమాపణలు చెప్పాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని అన్నాడు.