Nicholas Pooran : నికోలస్ పూరన్ గురించి ఈ విషయం తెలుసా..? పంత్ లాగానే యాక్సిడెంట్.. ఆటను వదులుకోవాలని డాక్టర్ల సలహా.. మొండి ధైర్యంతో..
పంత్ కంటే ముందుగానే నికోలస్ పూరన్ కు యాక్సిడెంట్ అయింది.

Nicholas Pooran, IPL 2025, Lucknow Super Giants, SRH vs LSG,
ఐపీఎల్ 2025 సీజన్‌లో నికోలస్ పూరన్ దంచికొడుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.
ఇక గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు దంచికొట్టాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 26 బంతులను ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. పూరన్ విజృంభించడంతో 191 పరుగుల లక్ష్యాన్ని లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Ravichandran Ashwin : ఐపీఎల్ అవార్డులను ఎగతాళి చేసిన అశ్విన్..! ఆ రోజు ఎంతో దూరంలో లేదు..
పంత్‌లాగానే పూరన్‌కు సైతం యాక్సిడెంట్..
టీమ్ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ డిసెంబర్ 2020లో కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన అతడు కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టి మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే.
కాగా.. పంత్ కంటే ముందుగానే నికోలస్ పూరన్ కు యాక్సిడెంట్ అయింది. పూరన్‌కు 19 ఏళ్లు ఉండగా.. 2015లో ట్రినిడాడ్‌లో కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి రెండు కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతడు క్రికెట్‌ను వదులుకుంటేనే అతడి ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సైతం సలహాలు ఇచ్చారు.
SRH vs LSG : లక్నోపై సన్‌రైజర్స్ ఓడిపోవడంతో.. కావ్య ఎంతలా బాధపడిందో చూశారా?
నిలబడేందుకు కూడా అతడి కాలు సహకరించకపోవడంతో కొన్ని నెలల పాటు వీల్ చైర్‌కే పరిమితం అయ్యాడు. లేచి నిలబడడం కోసం 6 నెలల్లో రెండు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో గర్ల్‌ఫ్రెండ్ ఎలిస్సా మిగుల్ అతడికి తోడుగా నిలబడింది. ఆమెను పూరన్ 2020లో పెళ్లి చేసుకున్నాడు.
పూరన్‌కు క్రికెట్ అంటే చాలా పిచ్చి. ఆటపై ఉన్న ఈ ఇష్టమే అతడిని కోలుకునేలా చేసింది. డాక్టర్లు వద్దని చెప్పినా వినకుండా మొండి ధైర్యంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. యాక్సిడెంట్ అయిన మరుసటి సంవత్సరమే అంటే 2016లో అతడు వెస్టిండీస్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేయడం గమనార్హం.
ఇప్పటి వరకు వెస్టిండీస్ తరుపున 61 వన్డేల్లో 39.66 సగటుతో 1983 పరుగులు చేశాడు. 106 టీ20ల్లో 26.15 సగటుతో 2275 పరుగులు చేశాడు. దేశం తరుపున ఓ మోస్తరు ప్రదర్శననే చేసినప్పటికి.. ఐపీఎల్‌తో పాటు వివిధ దేశాల్లో జరిగే టీ20లీగుల్లో మాత్రం తన విధ్వంసకర ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లు ఆడాడు. 33.6 సగటుతో 1914 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక మెగావేలానికి కంటే ముందు అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ.21కోట్లతో రిటైన్ చేసుకుంది. తన మెరుపు బ్యాటింగ్‌తో తనకు ఇచ్చే నగదుకు న్యాయం చేస్తున్నాడు పూరన్.