SRH vs LSG : ల‌క్నోపై స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోవ‌డంతో.. కావ్య ఎంత‌లా బాధ‌ప‌డిందో చూశారా?

ల‌క్నో చేతిలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు మ్యాచ్ ఓడిపోతున్న స‌మ‌యంలో, ఓడిపోయిన త‌రువాత కావ్యా పాప ఎక్స్‌ప్రెష‌న్స్ సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

SRH vs LSG : ల‌క్నోపై స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోవ‌డంతో.. కావ్య ఎంత‌లా బాధ‌ప‌డిందో చూశారా?

Kavya Maran expressions goes viral during SRH vs LSG Match

Updated On : March 28, 2025 / 10:18 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఉప్ప‌ల్ వేదిక‌గానే జ‌రిగిన తొలి మ్యాచ్‌లో.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే రెండో (286) అత్య‌ధిక స్కోరును న‌మోదు చేసింది ఎస్ఆర్‌హెచ్. ఈ క్ర‌మంలో 300 ప‌రుగ‌ల టార్గెట్‌తో ల‌క్నోతో మ్యాచ్‌లో బ‌రిలోకి దిగింది.

అయితే.. ల‌క్నో బౌల‌ర్ల ధాటికి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ల‌క్నో బౌల‌ర్ శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్ల‌తో ఎస్ఆర్‌హెచ్ ప‌త‌నాన్ని శాసించాడు.

SRH vs LSG : ల‌క్నో చేతిలో ఓట‌మిపై స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ క‌మిన్స్ కామెంట్స్‌.. ‘ముందు ముందు మేమేంటో చూపిస్తాం..’

ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ (47), అనికేత్ వ‌ర్మ (36), నితీశ్ కుమార్ రెడ్డి (32) లు రాణించారు. హెన్రిచ్ క్లాసెన్ (26) ఫ‌ర్వాలేద‌నిపించాడు. అభిషేక్ శ‌ర్మ (6), ఇషాన్ కిష‌న్ (0)లు విఫ‌లం అయ్యారు. ఆఖ‌రిలో కెప్టెన్ క‌మిన్స్ 4 బంతుల్లో మూడు సిక్స‌ర్లు బాది 18 ప‌రుగులు చేశాడు.

191 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ 16.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నికోల‌స్ పూర‌న్ పెను విధ్వంసం సృష్టించాడు. కేవ‌లం 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్ల సాయంతో 70 ప‌రుగులు చేశాడు.

Vinesh Phogat : ప్రభుత్వ ఉద్యోగమా? రూ.4 కోట్లా? స్థలమా?.. ఏది కావాలి?

మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 52 ప‌రుగుల‌తో రాణించాడు. ఇక చివ‌ర‌ల్లో అబ్దుల్ స‌మ‌ద్ చాలా వేగంగా ఆడాడు. కేవ‌లం 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాది 22 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

కావ్య పాప పిక్స్ వైర‌ల్‌..

స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్‌కు కావ్య మార‌న్ ఓన‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. త‌న జ‌ట్టు ఆడే ప్ర‌తి మ్యాచ్‌కు హాజ‌రు అవుతూ ప్లేయ‌ర్ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూ ఉంటుంది. కాగా.. ల‌క్నో చేతిలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు మ్యాచ్ ఓడిపోతున్న స‌మ‌యంలో, ఓడిపోయిన త‌రువాత కావ్య పాప ఎక్స్‌ప్రెష‌న్స్ సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

SRH vs LSG : స‌న్‌రైజ‌ర్స్ పై విజ‌యం.. మెట్లు దిగి వ‌చ్చి మ‌రీ పంత్‌ను గ‌ట్టిగా కౌగ‌లించుకున్న సంజీవ్ గొయెంకా..

బాధ‌ప‌డ‌కు.. మ‌ళ్లీ హైద‌రాబాద్ గెలుపు బాట ప‌డుతుంద‌ని, నిన్ను ఇలా చూడ‌లేక‌పోతున్నాం అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.