IPL 2025 Final: ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్..
79 పరుగుల స్కోర్ వద్ద పంజాబ్ తన మూడో వికెట్ ను కోల్పోయింది.

Courtesy BCCI
IPL 2025 Final: ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. అత్యంత కీలక వికెట్ కోల్పోయింది. పంజాబ్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి అయ్యర్ ఔటయ్యాడు. బెంగళూరు బౌలర్ రొమారియో షెపర్డ్ అద్భుతమైన బంతితో అయ్యర్ ను పెవిలియన్ కు పంపాడు. ఒక పరుగు మాత్రమే చేసి అయ్యర్ ఔట్ కావడంతో పంజాబ్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. 9.4 ఓవర్లలో 79 పరుగుల స్కోర్ వద్ద పంజాబ్ తన మూడో వికెట్ ను కోల్పోయింది.
ఫైనల్ మ్యాచ్ మలుపులు తిరుగుతోంది. 191 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ 79 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ ధాటిగా ఆడారు. ఇంతలోనే ఇద్దరూ ఔటయ్యారు. ప్రియాంశ్ 24, ప్రభ్ సిమ్రన్ 26 రన్స్ చేయడంతో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపించిన పంజాబ్.. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 79 పరుగులకే మూడు కీలక వికెట్లు పడటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ, పంజాబ్ మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా నడుస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీని పంజాబ్ బౌలర్లు కట్టడి చేశారు. దాంతో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులే చేసింది. ఆర్సీబీ బ్యాటర్లు ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.