Gt Vs LSG: ధనాధనా హాఫ్ సెంచరీలు బాదిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి రెండేసి వికెట్లు తీయగా, దిగ్వేశ్ సింగ్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.

Pic: @IPL (X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది ఎల్‌ఎస్‌జీ.
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడి ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. సాయిసుదర్శన్ 56, శుభమన్ గిల్ 60 పరుగులు తీశారు. జోస్ బట్లర్ 16, వాషింట్టన్ సుందర్ 2, రుథర్‌ఫర్డ్ 22, షారుక్ ఖాన్ 11 (నాటౌట్), రాహుల్ తెవాటియా 0, రషీద్ ఖాన్ 4(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో గుజరాత్ స్కోరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180గా నమోదైంది.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి రెండేసి వికెట్లు తీయగా, దిగ్వేశ్ సింగ్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
గుజరాత్ టైటాన్స్ జట్టు
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షేర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ టెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
ఐడెన్ మార్క్రామ్, నికోలస్, రిషబ్ పంత్, హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లెర్, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, ఆకాష్ డీప్, డిగ్వెష్ సింగ్ రతి, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయి