ధనాధనా హాఫ్ సెంచరీలు బాదిన ఓపెనర్లు కోహ్లీ, ఫిలిప్ సాల్ట్.. ఆర్సీబీ ఘనవిజయం

ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, యశ్ దయాల్, హజ్లేవూడ్, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

ధనాధనా హాఫ్ సెంచరీలు బాదిన ఓపెనర్లు కోహ్లీ, ఫిలిప్ సాల్ట్.. ఆర్సీబీ ఘనవిజయం

Pic: @IPL (X)

Updated On : April 13, 2025 / 7:05 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జైపూర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ బ్యాటర్లు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు బాదారు.

ఈ మ్యాచులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 75, శాంసన్ 15, రియాన్ పరాగ్ 30, ధ్రువ్ జురెల్ 35 (నాటౌట్), హిట్మెయర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు బాదారు. దీంతో ఆ జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 173గా నమోదైంది.

ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, యశ్ దయాల్, హజ్లేవూడ్, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు ఫిలిప్ సాల్ట్ 65, విరాట్ కోహ్లీ 62 (నాటౌట్), పడిక్కల్ 40 (నాటౌట్) పరుగులు తీశారు. దీంతో 17.3 ఓవర్లలో ఆర్సీబీ ఒక వికెట్ నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్ఆర్ బౌలర్లలో కుమార్ కార్తికేయ ఒక వికెట్ తీశాడు.

Also Read: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచులో ఆర్సీబీ ఇలా రెడ్‌ జెర్సీ కాకుండా గ్రీన్‌ జెర్సీ ఎందుకు ధరించింది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్

రాజస్థాన్ రాయల్స్ జట్టు
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే