IPL 2025 New Rules : ఛాంపియన్స్ ట్రోఫీలో ఆటగాళ్లు బిజీ.. సైలెంట్‌గా ఐపీఎల్ కొత్త రూల్స్ విడుదల చేసిన బీసీసీఐ..
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

IPL 2025 new Rules Family Restrictions Dress Code and More
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లోనే ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మొదలుకానుంది. ఐపీఎల్ 18వ సీజన్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త నిబంధలను తీసుకువచ్చింది. ఇటీవలే భారత జట్టు పై నియంత్రణ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఆటగాళ్ల పైనా కూడా దాదాపుగా అవే ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులను డ్రెస్సింగ్ రూమ్‌ల్లోకి అనుమతించం అని పేర్కొంది. ఇక ఆటగాళ్లు అందరూ కూడా ప్రాక్టీస్ లేదా మ్యాచ్‌ల కోసం స్టేడియాలకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా టీమ్ బస్సులోనే ప్రయాణించాలని సూచించింది. ఇప్పటికే భారత ఆటగాళ్లకు ఈ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. జెర్సీ నంబర్లలో మార్పు ఉంటే 24 గంటల ముందుగానే తెలియజేయాలని పేర్కొంది.
కొత్త నిబంధనలు ఇవే..
– ప్రాక్టీస్, మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు తప్పకుండా టీమ్ బస్‌లోనే ప్రయాణించాలి. ఈ విషయాన్ని ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ తెలియజేసింది.
– ఆటగాళ్లు, సహాయక సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులను డ్రెస్సింగ్ రూమ్‌ల్లోకి అనుమతించరు. మ్యాచ్ రోజే కాదు ప్రాక్టీస్ రోజుల్లోనూ ఈ నిబంధన కొనసాగనుంది. గుర్తింపు కార్డు ఉన్న, అనుమతించిన సిబ్బంది మినహా మరెవరికీ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతి లేదు.
– ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ మైదానానికి చేరుకోవచ్చు. వాళ్లు ప్రాక్టీస్‌ను చూడాలనుకు చూడొచ్చు. అది కూడా వీక్షకులను అనుమతి ఇచ్చిన ప్రాంతం నుంచే చూడాల్సి ఉంటుంది. ఇక నెట్ బౌలర్లు, త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు కూడా అనుమతి తీసుకోవాల్సిందే.
– ‘ఆరెంజ్ క్యాప్’, ‘పర్పుల్ క్యాప్’ సాధించిన ఆటగాళ్లు మ్యాచ్ ఆరంభంలో కనీసం రెండు ఓవర్ల పాటైనా ఆ క్యాప్‌లను ధరించాలి.
– మ్యాచ్ అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో ప్లేయర్లు స్లీవ్‌లెస్ జెర్సీలను ధరించకూడదు.
– ఐపీఎల్ 2024 సీజన్ లాగానే మ్యాచ్ రోజుల్లో టీమ్ డాక్టర్‌తో సహా 12 మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
– జెర్సీ నంబర్లలో ఏవైన మార్పు ఉంటే.. మార్గదర్శకాల ప్రకారం పేర్కొన్న విధంగా 24 గంటల ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది.
మార్చి 22 నుంచి మే 25 ఐపీఎల్ 18వ సీజన్ కొనసాగనుంది. ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది.