IPL 2025: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఏది? టాప్ బ్యాటర్‌, బౌలర్ ఎవరు?

బ్యాటర్లలో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాడు నికోలస్ పూరన్ 201 పరుగులు బాది అగ్రస్థానంలో ఉన్నాడు.

IPL 2025: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఏది? టాప్ బ్యాటర్‌, బౌలర్ ఎవరు?

Pic : @SunRisers (X)

Updated On : April 6, 2025 / 5:16 PM IST

ఇండియన్ ప్రైమరీ లీగ్‌ 2025లో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క మ్యాచు కూడా ఓడిపోలేదు. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మొత్తం మూడు మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడింటిలోనూ గెలుపొందింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి.

పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ రెండు మ్యాచులో గెలిచి ఒకటి ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి.

ఇక గుజరాత్, పంజాబ్, కోల్‌కతా, లక్నో, రాజస్థాన్‌ జట్ల ఖాతాల్లోనూ నాలుగేసి పాయింట్లు ఉన్నాయి. ముంబై, చెన్నై, హైదరాబాద్‌ జట్ల ఖాతాల్లో రెండేసి పాయింట్లు ఉన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడి ఒక్కదాంట్లో మాత్రమే గెలిచి, మూడు మ్యాచుల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఆదివారం గుజరాత్‌లో హైదరాబాద్‌ తలపడుతోంది.

బ్యాటర్లలో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాడు నికోలస్ పూరన్ 201 పరుగులు బాది అగ్రస్థానంలో ఉన్నాడు.

బౌలర్లలో సూపర్ కింగ్స్‌ ఆటగాడు నూర్ అహ్మద్ ఇప్పటివరకు 10 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నాడు.

పాయింట్లు ఎన్ని? నెట్‌రన్‌రేట్‌ ఎంత?