IPL 2025: చెలరేగిపోయిన బెంగళూరు బౌలర్లు.. పరుగులకే పంజాబ్ ఆలౌట్..
పంజాబ్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్ ను తలపించింది. కీలక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.

Courtesy BCCI
కీలకమైన క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బౌలర్లు చెలరేగిపోయారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలోనే పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్ ను తలపించింది. కీలక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.
బెంగళూరు బౌలర్లు అంతా చెలరేగిపోయారు. సుయాశ్ శర్మ, హేజిల్ వుడ్ తలో 3 వికెట్లు పడగొట్టారు. యశ్ దయాల్ 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ చెరో వికెట్ తీశారు.