IPL 2025: అదేం కొట్టుడు రా నాయనా.. ఐపీఎల్‌లో 14ఏళ్ల కుర్రాడి ఊచకోత.. వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ..
సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 11 సిక్సులు, 7 ఫోర్లు బాదేశాడు.

Courtesy BCCI @IPL
IPL 2025: ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ స్టార్, 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో చెలరేగిపోయాడు. బ్యాట్ తో విధ్వంసం చేశాడు. బౌండరీల వర్షం కురిపించాడు. కొడితే సిక్స్ లేదంటే ఫోర్. ఈ క్రమంలో వైభవ్ సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 35 బంతుల్లోనే ఈ చిచ్చరపిడుగు శతకం బాదేశాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 11 సిక్సులు, 7 ఫోర్లు బాదేశాడు.
తొలుత 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఆ తర్వాత 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ క్రిస్ గేల్ (30 బంతులు) పేరిట ఉంది. ఐపీఎల్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ గా వైభవ్ రికార్డ్ నెలకొల్పాడు. కాగా, శతం చేసిన వెంటనే వైభవ్ ఔటయ్యాడు. 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. వైభవ్ సంచలన బ్యాటింగ్ చూసి రాహుల్ ద్రవిడ్ మెస్మరైజ్ అయిపోయాడు. వీల్ చైర్ లో నుంచి పైకి లేచి మరీ ప్రశంసించాడు.

Courtesy BCCI @IPL
రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ..
* ఈ సీజన్ లోనే ఫాస్టెస్ట్ 50 నమోదు
* రాజస్థాన్ రాయల్స్ తరఫున ఫాస్టెస్ట్ 50
* ఆర్ఆర్ కి ఇది రెండో ఫాస్టెస్ట్ 50
* కెరీర్ లోనే ఫాస్టెస్ట్ T20 సెంచరీ
* సిక్స్ కొట్టి సెంచరీ నమోదు
* భారతీయులలో అత్యంత వేగవంతమైన సెంచరీ
* గేల్ తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
* ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా(14Y32D) రికార్డ్.
* ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా(14Y32D) వైభవ్ రికార్డ్.
Also Read: ఐపీఎల్ ద్వారా గట్టిగానే సంపాదించిన కృనాల్ పాండ్యా.. అతడి మొత్తం ఆస్తి ఎంతంటే..?
IPL లో ఫాస్టెస్ట్ సెంచరీలు (బంతుల పరంగా)..
క్రిస్ గేల్ – ఆర్సీబీ- 30 బంతులు
వైభవ్ సూర్యవంశీ – ఆర్ఆర్ – 35 బంతులు
యూసఫ్ పఠాన్ – ఆర్ఆర్ – 37 బంతులు
డేవిడ్ మిల్లర్ – కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – 38 బంతులు
ట్రావిస్ హెడ్ – ఎస్ఆర్ హెచ్- 39 బంతులు
ప్రియాంశ్ ఆర్య – పంజాబ్ కింగ్స్ – 39 బంతులు
అభిషేక్ శర్మ – ఎస్ఆర్ హెచ్ – 40 బంతులు
విల్ జాక్స్ – ఆర్సీబీ – 41 బంతులు
ఆడమ్ గిల్ క్రిస్ట్ – డెక్కన్ చార్జర్స్ – 42 బంతులు
డివిలియర్స్ – ఆర్సీబీ – 43 బంతులు
డేవిడ్ వార్నర్ – ఎస్ ఆర్ హెచ్ – 43 బంతులు
సనత్ జయసూర్య – ముంబై ఇండియన్స్ – 45 బంతులు
మయాంక్ అగర్వాల్ – కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – 45 బంతులు
2010లో ముంబై ఇండియన్స్ పై యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆ సమయానికి వైభవ్ సూర్యవంశీ ఇంకా పుట్టనే లేదు. యూసుఫ్ పఠాన్ కూడా రాజస్థాన్ రాయల్స్ నుంచి వచ్చాడు.
Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅
Fastest TATA IPL hundred by an Indian ✅
Second-fastest hundred in TATA IPL ✅Vaibhav Suryavanshi, TAKE. A. BOW 🙇 ✨
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6
— IndianPremierLeague (@IPL) April 28, 2025