IPL 2025 : 14ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. గుజరాత్‌పై రాజస్థాన్ సంచలన విజయం..

Courtesy BCCI
IPL 2025 : గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. రాజస్తాన్ యంగ్ స్టార్ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీతో గుజరాత్ పై రాజస్తాన్ గెలుపొందింది. 210 పరుగుల టార్గెట్ ను రాజస్తాన్ అలవోకగా ఛేజ్ చేసింది. 8 వికెట్ల తేడాతో జీటీని చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. గిల్(84), బట్లర్(50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో గుజరాత్ భారీ స్కోర్ చేయగలిగింది. అయితే రాజస్తాన్ యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ.. తన సంచలన బ్యాటింగ్ తో మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాడు. ఒంటి చేత్తో జట్టుకి విజయాన్ని అందించాడు.
ఈ 14 ఏళ్ల చిచ్చరపిడుగు సెంచరీతో కదంతొక్కాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మరో ఎండ్ లో యశస్వి జైస్వాల్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరూ చెలరేగడంతో మరో 25 బంతులు మిగిలి ఉండగానే.. టార్గెట్ ను ఛేజ్ చేసింది ఆర్ఆర్.
Also Read: ఐపీఎల్ ద్వారా గట్టిగానే సంపాదించిన కృనాల్ పాండ్యా.. అతడి మొత్తం ఆస్తి ఎంతంటే..?
స్కోర్లు..
గుజరాత్ టైటాన్స్ – 20 ఓవర్లలో – 209/4
రాజస్తాన్ రాయల్స్ – 15.5 ఓవర్లలో – 212/2