IPL 2025: దినేశ్ కార్తీక్‌కు హాయ్ చెప్పిన అక్షర్ పటేల్.. జోక్ చేయొద్దంటూ డీకే సీరియస్..! ఆ తరువాత ఏం జరిగిదంటే.. వీడియో వైరల్
నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అక్షర్ పటేల్.. దినేశ్ కార్తీక్ (డీకే) రావడాన్ని గమనించి ప్రాక్టీస్ ను ఆపేసి డీకేను పలుకరించాడు. ‘నా బ్రదర్ డీకేకు హాయ్ చెప్పేందుకు వచ్చా అంటూ ..

Dinesh Karthik vs Axar Patel
Dinesh Karthik – Axar Patel: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి ఢిల్లీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇరు జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది మ్యాచ్ లు ఆడగా.. ఆరు మ్యాచ్ లలో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొమ్మిది మ్యాచ్ లు ఆడగా.. ఆరు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇరు జట్లు పాయింట్ల పట్టికలో సమఉజ్జీలుగా ఉన్నాయి. అయితే, ఇవాళ జరిగే మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: IPL 2025: ఐపీఎల్ -2025లో అదరగొడుతున్న బౌలర్లు వీరే.. ఇప్పటి వరకు ఎన్ని డాట్ బాల్స్ వేశారో తెలుసా..?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అక్షర్ పటేల్ సారథ్యం వహిస్తున్నాడు. మ్యాచ్ సందర్భంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆర్సీబీ జట్టుకు మెంటార్ గా ఉన్న దినేశ్ కార్తీక్ అక్షర్ పటేల్ వైపు వెళ్లాడు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: పాక్‌తో ఇక ఐసీసీ టోర్నీల్లోనూ భారత్ ఆడకూడదు అంతే..: గంగూలీ
నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అక్షర్ పటేల్ దినేశ్ కార్తీక్ (డీకే) రావడాన్ని గమనించి.. ప్రాక్టీస్ ను ఆపేసి డీకేను పలుకరించాడు. ‘నా బ్రదర్ డీకేకు హాయ్ చెప్పేందుకు వచ్చా అంటూ’ అన్నాడు.. దీంతో డీకే స్పందిస్తూ ‘మంచి సారథిగా ఉండు’ అనగానే.. ‘మీరు నాకు సోదరుడులాంటి వారు.. అందుకే విష్ చేయడానికి వచ్చా’ అంటూ అక్షర్ సమాధానం ఇచ్చాడు. దీంతో డీకే స్పందిస్తూ ‘ముందు నువ్వు వెళ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ చెయ్యి.. జోక్ చేయొద్దు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.. మళ్లీ వెంటనే వెనక్కు తిరిగి.. ‘అందుకే నేను నెట్స్ దగ్గరకు రాను’ నవ్వుకుంటూ డీకే అనడం వీడియోలో వినిపించింది.
DK bhai se milne ke liye sab ruk sakta hai 🫂🫶 pic.twitter.com/0mHThRPXRI
— Delhi Capitals (@DelhiCapitals) April 26, 2025
అయితే, వీరిద్దరి మధ్య సంభాషణ సరదాగా సాగింది. ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.