IPL 2025: ఐపీఎల్ -2025లో అదరగొడుతున్న బౌలర్లు వీరే.. ఇప్పటి వరకు ఎన్ని డాట్ బాల్స్ వేశారో తెలుసా..?
ఐపీఎల్ 2025 టోర్నీలో మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మ్యాచ్ మ్యాచ్ కు పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు మారిపోతున్నాయి.

Credit BCCI
Most Dot Balls in IPL 2025: ఐపీఎల్ 2025 టోర్నీలో మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మ్యాచ్ మ్యాచ్ కు పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు మారిపోతున్నాయి. శనివారం (ఏప్రిల్ 26వ తేదీ) వరకు ఐపీఎల్ లో 44 మ్యాచ్ లు పూర్తయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపు ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయినట్లే. మిగిలిన జట్లు ప్లేఆప్స్ లో స్థానం కోసం పోటీపడుతున్నాయి.
Also Read: CSK vs SRH : చెన్నై పై విజయం.. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు..
సాధారణంగా ఐపీఎల్ అంటే బ్యాటర్లకు స్వర్గదామంగా ఉంటుంది. సిక్సులు, ఫోర్లతో బ్యాటర్లు భారీ పరుగులు చేస్తుంటారు. అయితే, ఈ ఐపీఎల్ సీజన్ లో బ్యాటర్లతోపాటు బౌలర్లు సత్తాచాటుతున్నారు. ఊహించని రీతిలో మ్యాచ్ ఫలితాలను బౌలర్లు తారుమారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన 44 మ్యాచ్ లలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్లు ఎవరో ఓసారి తెలుసుకుందాం.
Also Read: Umpires Salary : ఐపీఎల్‌లో ఒక్కొ మ్యాచ్‌కు అంపైర్లు ఎంత సంపాదిస్తారో తెలుసా..?
♦ మహమ్మద్ సిరాజ్ (గుజరాత్ టైటాన్స్): గత సంవత్సరం ఆర్సీబీ తరపున ఆడిన సిరాజ్ ప్రస్తుత ఐపీఎల్ -2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. అద్భుతంగా బౌలింగ్ తో ఆ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో అతను 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇందులో 93 డాట్ బాల్స్ వేశాడు.
♦ ఖలీల్ అహ్మద్ (చెన్నై సూపర్ కింగ్స్): చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 32 ఓవర్లు బౌలింగ్ చేసి 288 పరుగులు ఇచ్చాడు. 93 డాట్ బాల్స్ వేశాడు.
♦ జోష్ హాజిల్‌వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు హాజిల్‌వుడ్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. 32.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు, అందులో 93 డాట్ బాల్స్ వేశాడు.
♦ జోఫ్రా ఆర్చర్ ( రాజస్థాన్ రాయల్స్): ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్.. ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అతను ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో 87 డాట్ బాల్స్ వేశాడు.
♦ ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ జెయింట్స్): గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 31 ఓవర్లు వేసి 226 పరుగులు ఇచ్చాడు. కృష్ణ ఇప్పటివరకు 85 డాట్ బాల్స్ వేశాడు.