IPL 2025: రిషబ్ భయ్యా.. మీరే గెలవాలి.. గుజరాత్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్..! కోహ్లీ, రోహిత్ కోట్లాడుకోవాలట..
రిషబ్ పంత్ భయ్యా మీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టే గెలవాలి.. మా కోసమైనా ఈ ఒక్క మ్యాచ్ గెలవండి అంటూ గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు చేస్తున్నారు.

IPL 2025
IPL 2025: రిషబ్ పంత్ భయ్యా మీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టే గెలవాలి.. మా కోసమైనా ఈ ఒక్క మ్యాచ్ గెలవండి అంటూ గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఉంది.. ఇవాళ ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో లక్నో విజయం సాధిస్తేనే గుజరాత్ టైటాన్స్ టాప్-2లో ప్లేస్ దక్కించుకుంటుంది.
Also Read: IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. సచిన్ మరో రికార్డును బద్దలు కొట్టేశాడు..
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో ప్లేస్ కోసం పోటీపడుతున్నాయి. అయితే, సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టుపై విజయంతో పాయింట్ల పట్టికలో టాప్-2 ప్లేస్‌ను పంజాబ్ కింగ్స్ ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ, గుజరాత్ జట్లు టాప్-2లో ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ లో లక్నో విజయం సాధిస్తే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్‌కే పరిమితం అవుతుంది. దీంతో సెమీ ఫైనల్స్-2లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడాల్సి ఉంటుంది.
లక్నోపైనే గుజరాత్ ఆశలు..
♦ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఆర్సీబీ విజయం సాధిస్తే 19 పాయింట్లతో టాప్-2 ప్లేస్ లోకి వెళ్తుంది. దీంతో మొదటి రెండు స్థానాల్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ జట్లు నిలుస్తాయి.
♦ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఆర్సీబీ ఓడిపోతే.. పాయింట్ల పట్టికలో 18పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న గుజరాత్ జట్టుకు టాప్-2లో ప్లేస్ ఖాయమవుతుంది.
♦ ఒకవేళ వర్షం వచ్చి లక్నో, ఆర్సీబీ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో బెంగళూరు, గుజరాత్ జట్లు 18 పాయింట్లతో సమంగా ఉంటాయి. కానీ, రన్ రేట్ ఆధారంగా బెంగళూరు జట్టుకే టాప్-2లో ప్లేస్ దక్కించుకునే అవకాశం ఉంటుంది.
టాప్-2 స్థానాల్లో ఉంటే బెనిఫిట్ ఇదే..
♦ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళ్తుంది. ఓడిపోయిన జట్టుకు ఫైనల్స్ కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. టాప్-3,4 జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టుపై ఆడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ లో గెలిచినా ఫైనల్స్ కు చేరుకోవచ్చు.
♦ టాప్-3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ మ్యాచ్ లో విజయం సాధించినా.. మళ్లీ టాప్- 1, 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుపై ఆడి గెలవాల్సి ఉంటుంది. అప్పుడే ఫైనల్స్ కు చేరుకునే అవకాశం ఉంటుంది.