IPL 2026: చిత్తుగా ఓడిన చెన్నై.. గుజరాత్ ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులే చేసింది.
IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులే చేసింది. 159 రన్స్ టార్గెట్ ను గుజరాత్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో చేజ్ చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 46 బంతుల్లోనే 87 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మరో ఎండ్ లో బట్లర్ (39), కెప్టెన్ గిల్ 23 బంతుల్లో 33 పరుగులతో రాణించారు. ఈ సీజన్ లో చెన్నైకి ఇది 5వ పరాజయం. గుజరాత్ కి నాలుగో విజయం.
