IPL 2026 RCB vs GT : బౌలర్లు పోరాడారు.. కానీ, వారివల్లే ఓడిపోయాం.. అతను మాపై ఒత్తిడి పెంచాడు.. రజత్ పాటిదార్ కీలక కామెంట్స్..
IPL 2026 RCB vs GT : గుజరాత్ జట్టుపై ఓటమి అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. జట్టు ఓటమికి కారణాలను వివరించారు.
Rajat Patidar
- ఆర్సీబీ జట్టుపై గుజరాత్ విజయం
- ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్స్
- జట్టు ఓటమికి కారణాలను వెల్లడి
IPL 2026 RCB vs GT : ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జట్టుపై ఓటమి అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 15.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని అన్నారు.
బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణం. శుభ్మన్ గిల్ పవర్ ప్లేలోనే దూకుడుగా ఆడి తమపై ఒత్తిడి పెంచాడు. కానీ, తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంవల్ల మళ్లీ పుంజుకున్నాం. అయితే ఆశించిన స్థాయిలో ఫలితం సాధించలేక పోయాం. మేము చేసిన పరుగులు ఈ వికెట్ పై ఏమాత్రం సరిపోవని మాకు తెలుసు.. కానీ, మా బౌలర్లు బౌలింగ్ చేసిన తీరు.. మ్యాచ్ను 16వ ఓవర్ వరకు తీసుకెళ్లడం సానుకూల సంకేతం. ఈ పిచ్ పై గడ్డి ఉండటం వల్ల పాస్ట్ బౌలర్లకు సహకరించింది.
మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం కూడా మా ఓటమికి ప్రధాన కారణం. చెప్పాలంటే అక్కడే మేము పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాం. ఈ తప్పిదాలను మరో మ్యాచ్ లో పునరావృతం కాకుండా సరిచేసుకోవాలి. ఇంకా చాలా మ్యాచ్ లు ఉన్నాయి. మేము ఒక్కో మ్యాచ్ పై దృష్టి పెడతాం. ఇది సుదీర్ఘమైన టోర్నీ.. మేము పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించడం లేదు. మంచి క్రికెట్ ఆడటమే మా లక్ష్యం అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.
Rajat Patidar said, “we are not looking at the table, our aim is to play good cricket”. pic.twitter.com/fVTusvc0sV
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2026
