IPL 2026: ముంబై పై బెంగళూరు ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విధ్వంసం సృష్టించింది. భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.
IPL 2026: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అదరగొట్టింది. ముంబై పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విధ్వంసం సృష్టించింది. భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 241 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులే చేసింది. దీంతో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబై జట్టులో బ్యాటర్ రూధర్ ఫోర్డ్ సెన్సేషనల్ బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 31 బంతుల్లోనే 71 పరుగులు బాదాడు. ఏకంగా 9 సిక్సర్లు కొట్టాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ముంబైకి ఓటమిని తప్పించలేకపోయాడు. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది మూడో విజయం. ముంబై ఇండియన్స్ కి హ్యాట్రిక్ పరాజయం.
