Abhishek Sharma : ఉప్పల్‌లో అభిషేక్ శర్మ ఊచకోత.. 9 సిక్సర్లు, 7 ఫోర్లతో సెంచరీ
ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) శతకంతో చెలరేగాడు.
IPL 2026 SRH vs DC Abhishek Sharma Century (pic credit@ipl)
Abhishek Sharma : ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ శతకంతో చెలరేగాడు. ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 47 బంతుల్లోనే మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. నితీశ్ రాణా బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో శతకాన్ని అందుకున్నాడు. ఐపీఎల్లో అభిషేక్ కు ఇది రెండో సెంచరీ కాగా.. టీ20 కెరీర్లో నాలుగోది కావడం విశేషం.
𝐔𝐏𝐏𝐀𝐋’𝐒 👑💯pic.twitter.com/Ob6i2U29y4
— SunRisers Hyderabad (@SunRisers) April 21, 2026
అంతేకాదండోయ్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 59 పరుగుల వద్ద అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఇక ఎస్ఆర్హెచ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. డేవిడ్ వార్నర్ 4014 పరుగులతో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
Ayush Mhatre : చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్..
ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక పరుగులు..
- డేవిడ్ వార్నర్ (4014 పరుగులు)
- శిఖర్ ధావన్ (2768 పరుగులు)
- కేన్ విలియమ్సన్ (2101 పరుగులు)
- అభిషేక్ శర్మ (2041* పరుగులు)
