SRH vs DC : ఢిల్లీపై సన్‌రైజర్స్ విజయం.. ఉప్పల్‌లో వెంకీ మామ స్టెప్పులకు కావ్యా పాప ఫిదా..
ఐపీఎల్ 2026లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs DC)విజయం సాధించింది.
IPL 2026 SRH vs DC Sunrisers hyderabad win against delhi hero Venkatesh and kvaiya maran recations viral
- ఉప్పల్‌లో సన్‌రైజర్స్ విజయం
- సంతోషంలో డ్యాన్స్ చేసిన వెంకీ మామ
- కావ్యా మారన్ ఫిదా
SRH vs DC : ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అభిషేక్ శర్మ (135 నాటౌట్; 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (37; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (25; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (37 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు.
Rinku Singh : కాశీ విశ్వనాథుడి సేవలో కాబోయే భార్యాభర్తలు రింకూ సింగ్, ప్రియా సరోజ్
View this post on Instagram
అనంతరం 243 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో నితీష్ రాణా (57; 30 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. సమీర్ రిజ్వీ (41; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (37; 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మలింగ నాలుగు వికెట్లు తీశారు. హర్ష్ దూబె మూడు వికెట్లు పడగొట్టాడు.
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉప్పల్‌లో ఏ మ్యాచ్ జరిగినా ప్రత్యక్షంగా వీక్షిస్తుంటాడు. ఇక మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ను వీక్షించాడు. సన్‌రైజర్స్ మ్యాచ్ గెలవడంతో వెంకీమామతో పాటు ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యా మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక వెంకీ మామ డ్యాన్స్ చేయగా.. కావ్య మారన్ చూస్తూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
View this post on Instagram
