IPL Final 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

పంజాబ్ కింగ్స్ తో ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ ఈ ఘనత సాధించాడు.

IPL Final 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

Courtesy BCCI

Updated On : June 3, 2025 / 9:28 PM IST

IPL Final 2025: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డ్ నెలకొల్పాడు. టోర్నీలో ఏకంగా 770 ఫోర్లు బాదాడు విరాట్. పంజాబ్ కింగ్స్ తో ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ శిఖర్ ధావన్ పేరున ఉంది. శిఖర్ 768 ఫోర్లు కొట్టాడు. దాన్ని విరాట్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత వార్నర్ 663 ఫోర్లతో ఉన్నాడు. రోహిత్ శర్మ 640 ఫోర్లు, రహానె 514 ఫోర్లు బాదారు.

ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇవాళ్టితో తెరపడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్.

లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, బెంగళూరు.. ఫైనల్ చేరే క్రమంలోనూ తమదైన ముద్ర వేశాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ, నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటికే మూడుసార్లు తలపడ్డాయి.