ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లు జమ్మూ కశ్మీర్‌లో..: గంభీర్

ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లను జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించే అవకాశాలున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. 

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 01:35 PM IST
ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లు జమ్మూ కశ్మీర్‌లో..: గంభీర్

Updated On : April 12, 2019 / 1:35 PM IST

ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లను జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించే అవకాశాలున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. 

ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లను జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించే అవకాశాలున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. ఎన్నికల ప్రచారంలో స్కీములు, ఆఫర్లు ఎంతవరకైనా వెళ్తాయనడానికి.. గంభీర్ చేసిన వ్యాఖ్యలే ఉదహరణగా చెప్పుకోవచ్చు. జమ్మూ రాష్ట్రంలోని ఓ నియోజకవర్గం నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న డా.జితేందర్ సింగ్ తరపున గౌతం గంభీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.
Read Also : శ్రేయాస్ అయ్యర్‌కు తలనొప్పిగా మారిన ఢిల్లీ గాయాలు

ఈ సందర్భంగా ఎవరైతే ఎంపీ ప్రజల గురించి వారి సంక్షేమం గురించి పనిచేస్తాడో వారికే ఓటు వేయాలని కోరాడు. ఈ సారి ఎన్నికల్లో మొదటి నుంచి సెలబ్రిటీలను ఎన్నికల ప్రచారంలోకి వాడుతున్న బీజేపీ.. గంభీర్‌ను ఇటీవలి కాలంలోనే కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. ఈ క్రమంలో జమ్మూలో ఎప్పుడూ లేనంతగా వరల్డ్ క్లాస్ స్టేడియం అనుమతులు వచ్చాయని గంభీర్ ప్రచారంలో భాగంగా చెప్పుకొచ్చాడు.

ఈ స్టేడియం త్వరగా పూర్తి అయితే ఈ సారి ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) జమ్మూలోనే జరిగే సూచనలున్నాయని తెలిపాడు. కాకపోతే ఇదంతా జరగాలంటే.. బీజేపీకి ఓటేసి మరోసారి నరేంద్ర మోడీనే ప్రధానమంత్రిని చేయాలని సూచించాడు. గంభీర్ చెప్పినట్లు జమ్మూలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించాలంటే ఆ రాష్ట్రం నుంచి కూడా ఐపీఎల్ జట్టు తయారవుతుందా.. లేదా గంభీర్ పొరబాటున జమ్మూలో తయారుకానున్న స్టేడియం గురించి చెప్పబోయి తప్పులో కాలేశాడా.. అనేది ఆ స్పీచ్ విన్న ఓటర్లకే తెలియాలి. 

Read Also : భారత్‌లో INDvAUS వన్డే మ్యాచ్.. ఎప్పుడంటే..