ఎందుకంట: IPL 2019 ఆరంభ వేడుకలు రద్దు

ఎందుకంట: IPL 2019 ఆరంభ వేడుకలు రద్దు

Updated On : February 22, 2019 / 10:26 AM IST

ఐపీఎల్ 11వ సీజన్ అనంతరం భారీ అంచనాలుతో సిద్ధం అవుతున్న 12వ సీజన్‌కు సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. లీగ్‌లోని తొలి మ్యాచ్‌ను మార్చి 23న డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ గడ్డపైనే జరగనుంది. రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరగనున్న ఈ తొలిపోరుకు ముందు ఆరంభ వేడుక జరగాల్సి ఉంది. ఏటా ప్రతి సీజన్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్స్ సొంత గడ్డపైనే వేడుకలు చేయడం ఆనవాయితీ. 
Read Also:ఆ ముగ్గురిలో : ధోనీ తర్వాత సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌?

ఈ వేడుకలలో ప్రముఖ సినీ తారలు కనువిందు చేస్తుంటారు. కానీ, ఈ సారి ఆరంభ వేడుకలేవీ లేవని తేల్చి చెప్పారు క్రికెట్ నియమ పాలకుల కమిటీ(సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్. ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల గురించే వేడుకను ఆపి వేయనున్నట్లు ప్రకటించారు. 

ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరపకూడదని నిర్ణయం తీసుకున్నాం.  దానికి అయ్యే ఖర్చును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఇవ్వాలనుకుంటున్నాం’ అని వెల్లడించారు. 
Read Also:అదే కారణమా : హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌కు కూడా దూరమే