బీసీసీఐ వార్నింగ్ : ఐపీఎలా.. పీఎస్ఎలా.. ఏదో ఒకటి తేల్చుకోండి

పాకిస్తాన్‌పై భారత్ అన్ని విధాల తెగదెంపులు చేసుకోవాలని చూస్తోంది. క్రికెట్ పరంగా చూస్తే ఐసీసీ వరల్డ్ కప్‌లో పాల్గొనే విషయంపై చూస్తే పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌లు రద్దు చేసేందుకు చర్చలు జరుపుతూ ఉంది. అయితే తామే నిర్వహిస్తోన్న ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో మాత్రం పాక్ క్రికెటర్లు ఆడేందుకు వీలు లేదని ఖండించింది. దాంతో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడే ఏ క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడకూడదనే కొత్త షరతులను అందుబాటులోకి తీసుకురానుంది.
Read Also : ద్రవిడ్ సలహాలే ఫామ్‌ను తెచ్చిపెట్టాయి: కేఎల్ రాహల్
ఈ మేరకు కొద్ది రోజుల ముందు భారత క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) సభ్యులు వినోద్ రాయ్, ఎడ్జుల్డీ, బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రిలు సమావేశమై ఈ విషయంపై చర్చించారట. ఇదే జరిగితే ఇప‍్పటికే పీఎస్‌ఎల్, ఐపీఎల్ ఆడుతున్న స్టార్ క్రికెటర్లు డ్వేన్ బ్రేవో, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, ఏబీ డివిలియర్స్‌లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
పుల్వామా ఉగ్రదాడి భారత్‌ను కుదిపేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న స్టేడియాలలో పాక్ క్రికెటర్ల ఫొటోలను సైతం తొలగించే స్థాయిలో విద్వేషాలు చెలరేగాయి. ఫిబ్రవరి 14న జరిగిన దాడిలో 40మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతాన్ని కలచివేసింది.
Read Also : కాళ్లబేరానికి పాక్ : మోడీతో ఫోన్ లో మాట్లాడటానికి సిద్ధమన్న ఇమ్రాన్
Read Also : Booking Start : జియోఫోన్2 ఫ్లాష్ సేల్ సందడి