ఈ సారి ఐపీఎల్ జరిగేది పాకిస్తాన్‌లో..: పాక్ క్రికెటర్
పాక్ క్రికెటర్ చేసిన తప్పు.. ఐపీఎల్‌ని పాకిస్తాన్‌లో ఆడేలా చేసింది. ప్రపంచంలోనే ధనిక దేశీవాలీ లీగ్.. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్).

పాక్ క్రికెటర్ చేసిన తప్పు.. ఐపీఎల్‌ని పాకిస్తాన్‌లో ఆడేలా చేసింది. ప్రపంచంలోనే ధనిక దేశీవాలీ లీగ్.. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్).
పాక్ క్రికెటర్ చేసిన తప్పు.. ఐపీఎల్‌ని పాకిస్తాన్‌లో ఆడేలా చేసింది. ప్రపంచంలోనే ధనిక దేశీవాలీ లీగ్.. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్). ఈ లీగ్‌తో పోల్చుకునే మిగిలిన దేశాలన్నీ పోటీ పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ మొదలుకానుండటంతో పాకిస్తాన్‌లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఐపీఎల్ సెగ అంటుకుంది. ఇందులో పాల్గొనే ప్లేయర్లు మాట్లాడిన ప్లేయర్లకు కూడా వాళ్ల లీగ్(పీఎస్ఎల్)ను మర్చిపోయి ఐపీఎల్ అనే వస్తుంది.
Read Also : మ్యాచ్ ఫిక్సింగ్.. మర్డర్ చేయడం కంటే మహా పాపం: ధోనీ
ఫిబ్రవరి 14న మొదలైన పీఎస్ఎల్ 26 గేమ్‌లు పూర్తి చేసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పాకిస్తాన్‌కు తిరుగుప్రయాణమైంది. ఈ మేర పీఎస్ఎల్ ప్రాంచైజీలలో ఒకటైన క్విటా గ్లాడియేటర్స్ క్రికెటర్ ఉమర్ అక్మల్.. తప్పులో కాలేయడంతో కొంచెం కాదు పెద్ద పొరబాటే దొర్లింది.
‘క్విట్టా కరాచీ చేరుకుంది. మేం సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్నాం. మాకు ఎంత మద్దతిస్తే అంత బాగా ఆడతాం. ఇలాగే ప్రతి జట్టును ప్రోత్సహిస్తే ఈ సారి ఐపీఎల్.. సారీ.. పీఎస్ఎల్ పాకిస్తాన్‌లోనే జరుగుతుంది’ అంటూ వీడియో కామెంట్ చేశాడు. పాపం అక్మల్ పబ్లిసిటీ కోసం చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారి అందరికీ నవ్వు తెప్పిస్తోంది.
Subhan Allah … pic.twitter.com/kjHzIz4yxO
— Taimoor Zaman (@taimoor_ze) March 9, 2019
Read Also : సన్‌రైజర్స్ బంపర్ ఆఫర్: రాజస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు టిక్కెట్లు