IPL2022 DC Vs RCB : బెంగళూరు భళా.. ఢిల్లీపై ఘనవిజయం

ఆల్ రౌండ్ షో తో బెంగళూరు అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో గెలుపొందింది.

IPL2022 DC Vs RCB : బెంగళూరు భళా.. ఢిల్లీపై ఘనవిజయం

Ipl2022 Dc Vs Rcb

Updated On : April 16, 2022 / 11:46 PM IST

IPL2022 DC Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ పోరులో ఆల్ రౌండ్ షో తో బెంగళూరు అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ నిర్దేశించిన 190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులకే పరిమితమైంది. దీంతో బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది.

ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. వార్నర్ 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ రిషన్ పంత్ (17 బంతుల్లో 34 పరుగులు) రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. హసరంగ ఒక వికెట్ తీశాడు.(IPL2022 DC Vs RCB)

IPL2022 MI Vs LSG : మళ్లీ ఓడిన ముంబై.. వరుసగా 6వ పరాజయం.. లక్నో ఘన విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. డుప్లెసిస్‌ సేన ఆరంభంలో తడబడినప్పటికీ ఆఖర్లో పుంజుకొని పరుగుల వరద పారించింది.

బెంగళూరు బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్‌ (34 బంతుల్లో 55 పరుగులు), దినేశ్‌ కార్తిక్‌ (34 బంతుల్లో 66 పరుగులు*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దినేశ్ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షాబాద్‌ (32*) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఆర్సీబీ జట్టులో దినేశ్‌ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్‌తో మరోసారి సత్తా చాటాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడిన దినేశ్ కార్తిక్.. ముస్తాఫిజుర్ రహ్మాన్ వేసిన 18వ ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. ఏకంగా నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాది.. ఒకే ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు. కార్తిక్ స్కోర్ లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ 34 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. షాబాజ్‌ అహ్మద్ కూడా ఆఖర్లో ధాటిగా ఆడాడు. కెప్టెన్ డు ప్లెసిస్‌ (8), అనుజ్‌ రావత్ (0), విరాట్ కోహ్లీ (12), సుయశ్ ప్రభుదేశాయ్‌ (6) విఫలమయ్యారు.

IPL2022 KKR Vs SRH : చెలరేగిన త్రిపాఠి, మార్‌క్రమ్.. హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం.. కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ

జట్ల వివరాలు:

ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ పటేల్, ముస్తాఫిజర్‌
రహ్మాన్‌, ఖలీల్ అహ్మద్

బెంగళూరు: డు ప్లెసిస్‌ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్, సూయష్‌ ప్రభుదేశాయ్‌, హసరంగ, హర్షల్‌
పటేల్, హేజిల్‌వుడ్, సిరాజ్‌