IPL2022 PBKS Vs CSK : లివింగ్‌స్టోన్‌ హాఫ్ సెంచరీ.. చెన్నై టార్గెట్ 181

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. చెన్నైకి 181 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.

IPL2022 PBKS Vs CSK : లివింగ్‌స్టోన్‌ హాఫ్ సెంచరీ.. చెన్నై టార్గెట్ 181

Ipl2022 Pbks Vs Csk

Updated On : April 3, 2022 / 9:53 PM IST

IPL2022 PBKS Vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు మంచి స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. చెన్నైకి 181 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

కాగా, పంజాబ్‌ జట్టు మరింత భారీ స్కోరు చేయకుండా చెన్నై బౌలర్లు అడ్డుకోగలిగారు. తొలి పది ఓవర్లకే వంద పరుగులు దాటిన పంజాబ్‌ను 20 ఓవర్లు ముగిసేసరికి 180/8కే పరిమితం చేయడంలో చెన్నై విజయవంతమైంది. ఆఖరి పది ఓవర్లలో పంజాబ్‌ కేవలం 71 పరుగులే చేసి 5 వికెట్లను కోల్పోయింది. పంజాబ్ బ్యాటర్లలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ హాఫ్ సెంచరీతో రాణించాడు. 32 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. శిఖర్ ధావన్‌ (33), జితేశ్‌ శర్మ (26) రాణించారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (4) నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో ప్రిటోరియస్‌, జొర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్‌ చౌదరి, రవీంద్ర జడేజా, బ్రావో తలో వికెట్ పడగొట్టారు.(IPL2022 PBKS Vs CSK)

IPL 2022 : గుజరాత్-ఢిల్లీ మ్యాచ్‌లో ట్విస్ట్.. లలిత్ యాదవ్ ఎలా రనౌట్ అయ్యాడంటే?

ఓ దశలో లివింగ్ స్టోన్, శిఖర్ దూకుడుకు పంజాబ్ స్కోరు 220 పరుగులు దాటేలా కనిపించింది. అయితే, ఈ జోడి జోరుకు కళ్లెం వేసి భారీ స్కోరు సాధించకుండా అడ్డుకున్నారు చెన్నై బౌలర్లు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కి ఆదిలోనే షాక్ తగిలింది. ముఖేశ్ చౌదరి వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన మయాంక్ అగర్వాల్, రెండో బంతికి రాబిన్ ఊతప్పకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్.

ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టిన భానుక రాజపక్స, తర్వాతి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. బంతిని ఆపిన క్రిస్ జోర్డాన్, వికెట్లకు దూరంగా త్రో విసిరాడు. అయితే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్న ధోనీ, మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. మహీ వికెట్లను పడగొట్టే సమయానికి క్రీజుకి అడుగు దూరంలో ఉన్న రాజపక్స, పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆఖర్లో రాహుల్ చాహర్ (8 బంతుల్లో 12 పరుగులు) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ మంచి స్కోరు సాధించింది.(IPL2022 PBKS Vs CSK)

ICC CEO : ఒలింపిక్స్‌‌లో క్రికెట్.. సంపాదన కోసం కాదన్న ICC సీఈవో

తన రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా లక్నోని ఆడ్డుకోలేకపోయిన చెన్నై ఈసారి విజయంతో బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐదో బౌలర్‌ లేని లోటును తీరుస్తూ దీపక్‌ చాహర్‌ ఈ మ్యాచ్‌లో అందుబాటులోకి రావడం చెన్నైకి ఊరటే. మరోవైపు భారీ స్కోరు మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన పంజాబ్‌.. తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో భంగపాటుకు గురైంది. బ్యాటర్లు, బౌలర్లు ఘోరంగా విఫలం కావడంతో కోల్‌కతాను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. మరి చెన్నైతో మ్యాచ్‌లో పంజాబ్‌ ఏ విధంగా రాణిస్తుందో చూడాలి.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌, చెన్నైసూప‌ర్ కింగ్స్ ఇప్ప‌టివ‌ర‌కు 25 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో చెన్నైసూప‌ర్ కింగ్స్ అత్య‌ధికంగా 15 మ్యాచుల్లో విజ‌యం సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ 10 మ్యాచుల్లో గెలిచింది.