ఉతప్ప ఉతుకుడు, శివాలెత్తిన శివం దూబె.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం
చెన్నై బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప, శివమ్ దూబె విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. దీంతో చెన్నై జట్టు భారీ స్కోర్ సాధించింది.

Ipl2022 Rcb Vs Csk
IPL2022 RCB Vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప, మిడిల్ ఆర్డర్ లో వచ్చిన శివమ్ దూబె విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. దీంతో చెన్నై జట్టు భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడినా.. ఆఖరి పది ఓవర్లలో రాబిన్ ఉతప్ప (88), శివమ్ దూబె (95*) హాఫ్ సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. డీవై పాటిల్ స్టేడియంలో పరుగుల వరద పారించారు.
బెంగళూరుకి 217 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. చెన్నై బ్యాటర్లలో రాబిత్ ఉతప్ప ఉతికి ఆరేశాడు. శివమ్ దూబె శివమెత్తాడు. రాబిత్ ఉతప్ప 50 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. శివమ్ దూబె 46 బంతుల్లోనే 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. బెంగళూరు బౌలర్లలో హసరంగ డిసిల్వ రెండు వికెట్లు పడగొట్టాడు. హేజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు.(IPL2022 RCB Vs CSK)
Our Top Performer from the first innings is @IamShivamDube for his excellent knock of 95* off 46 deliveries.
A look at his batting summary here ?? #TATAIPL pic.twitter.com/EO1h63RbIk
— IndianPremierLeague (@IPL) April 12, 2022
వరుస ఓటముల నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్… బెంగళూరుపై 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. మిడిలార్డర్ లో వచ్చిన యువ ఆల్ రౌండర్ శివమ్ దూబె పూనకం వచ్చినవాడిలా విరుచుకుపడగా, సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్ప వీరబాదుడు బాదాడు.
Sunil Gavaskar: కోహినూర్ ఏం చేశారంటూ.. బ్రిటీష్ కామెంటేటర్‌పై గవాస్కర్ సెటైర్
శివమ్ దూబే, ఉతప్ప జోడీ ఆడుతున్నంత సేపు బెంగళూరు బౌలర్లు ఏ బంతి వేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. మీడియం పేసర్ ఆకాష్ దీప్ ఒక ఓవర్లో తీవ్ర ఒత్తిడికి లోనై అనేక వైడ్లు విసిరాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా, బంతిని చితకబాది స్టాండ్స్ లోకి తరలించడమే తమ పని అన్నట్టుగా దూబే, ఊతప్ప బ్యాట్లు ఝుళిపించారు.
ఇక, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 17 పరుగులు చేయగా, మొయిన్ అలీ 3 పరుగులు చేశాడు. కెప్టెన్ రవీంద్ర జడేజా (0) డకౌట్ అయ్యాడు. కాగా, చివరి బంతికి సిక్స్ కొడితే సెంచరీ పూర్తవుతుందన్న నేపథ్యంలో, దూబె భారీ షాట్ కు యత్నించినా, అది బౌండరీ దాటలేదు. డుప్లెసిస్ క్యాచ్ పట్టినా, సరిగా బంతిని చేతిలో నిలపలేకపోయాడంతో దూబే నాటౌట్ గా నిలిచాడు.
Innings Break!
A sensational 165-run partnership between Uthappa (88) and Dube (95*) guides #CSK to a total of 216/4 on the board.#RCB chase coming up shortly. Stay tuned!#TATAIPL pic.twitter.com/uOr7P60zVa
— IndianPremierLeague (@IPL) April 12, 2022
టాస్ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ బౌలింగ్‌కు మొగ్గు చూపాడు. చెన్నై జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఐపీఎల్ లో చాంపియన్ గా గుర్తింపు పొందిన చెన్నై జట్టు.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బోణీ కొట్టకపోవడం గమనార్హం. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, బెంగళూరు మంచి జోష్ మీదుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో విజయం సాధించింది.
IPL2022 SRH Vs GT : గుజరాత్ జైత్రయాత్రకు హైదరాబాద్ బ్రేక్.. సీజన్‌లో తొలి ఓటమి..