IPL2022 RR Vs LSG : లక్నో జైత్రయాత్రకు బ్రేక్.. ఉత్కంఠపోరులో రాజస్తాన్ గెలుపు
ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో జట్టుకి రాజస్తాన్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠ పోరులో రాజస్తాన్ గెలుపొందింది.

Ipl2022 Rr Vs Lsg
IPL2022 RR Vs LSG : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో జట్టుకి రాజస్తాన్ షాక్ ఇచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్తాన్ విక్టరీ కొట్టింది. 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో జట్టును రాజస్తాన్ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. దీంతో రాజస్తాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డి కాక్ (39), దీపక్ హుడా (25), కృనాల్ పాండ్య (22) రాణించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్ డకౌట్ కాగా.. కృష్ణప్ప గౌతమ్ (0), జేసన్ హోల్డర్ (8), ఆయుష్ బదోని (5), దుష్మంత చమీర (13) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన మార్కస్ స్టొయినిస్ (38), అవేశ్ ఖాన్ (7) ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్తాన్ బౌలర్లలో యుజువేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ చెరో వికెట్ తీశారు.(IPL2022 RR Vs LSG)
IPL 2022: ఐపీఎల్లో ప్రత్యేక ఘనత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఓ దశలో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టును హెట్ మైర్, అశ్విన్ జోడీ ఆదుకుంది. ముఖ్యంగా షిమ్రోన్ హెట్ మైర్ చెలరేగాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
అశ్విన్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అయితే, హెట్ మైర్ మాత్రం చుక్కలు చూపించాడు. 36 బంతుల్లోనే 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 1 ఫోర్, 6 భారీ సిక్సులు ఉన్నాయి. దేవ్‌దత్ పడిక్కల్ (29), కెప్టెన్ సంజూ శాంసన్ (13), జోస్ బట్లర్ (13) పరుగులు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ (28) రిటైర్డ్ ఔట్‌గా మధ్యలోనే క్రీజు వీడాడు. వాండర్ డస్సెన్ (4), రియాన్ పరాగ్ (8) విఫలమయ్యారు. ట్రెంట్ బౌల్ట్ (2*) పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అవేశ్ ఖాన్ ఓ వికెట్ తీశాడు.
వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్తాన్‌కి బ్యాటింగ్ అప్పగించాడు. కాగా, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు లక్నో ఆడిన 5 మ్యాచుల్లో మూడింట్లో గెలుపొందగా.. రాజస్తాన్ జట్టు నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించింది.
IPL2022 RCB Vs MI : చెన్నై బాటలో ముంబై.. వరుసగా 4వ పరాజయం.. బెంగళూరు హ్యాట్రిక్ గెలుపు
తుది జట్ల వివరాలు..
రాజస్థాన్ : జోస్ బట్లర్, రస్సీ వాండర్ డస్సెన్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్ మైర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
లక్నో : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్
స్కోర్లు..
రాజస్తాన్ రాయల్స్-165/6(20 ఓవర్లు)
లక్నో సూపర్ జెయింట్స్-162/8(20 ఓవర్లు)
WHAT. A. GAME! ? ?@rajasthanroyals return to winning ways after edging out #LSG by 3 runs in a last-over finish. ? ?
Scorecard ? https://t.co/8itDSZ2mu7#TATAIPL | #RRvLSG pic.twitter.com/HzfwnDevS9
— IndianPremierLeague (@IPL) April 10, 2022