IPL2022 SH Vs LSG : చివర్లో చేతులెత్తేసిన హైదరాబాద్.. వరుసగా రెండో ఓటమి.. లక్నో ఖాతాలో మరో విజయం
170 పరుగుల టార్గెట్ తో బరిలోకి హైదరాబాద్ చతికిలపడింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఆఖర్లో బ్యాటర్లు చేతులెత్తేశారు.

Ipl2022 Sh Vs Lsg
IPL2022 SH Vs LSG : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్ష్య ఛేదనలో చివరల్లో చేతులెత్తేసింది. దీంతో పరాజయం పాలైంది. ఈ మెగా టీ20 టోర్నీలో హైదరాబాద్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. ఆఖరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 12 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాహుల్ సేన 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. 170 పరుగుల టార్గెట్ తో బరిలోకి హైదరాబాద్ చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి (30 బంతుల్లో 44 పరుగులు), నికోలస్ పూరన్ (24 బంతుల్లో 34 పరుగులు) మాత్రమే రాణించగా.. గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఆఖర్లో బ్యాటర్లు చేతులెత్తేశారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు. జేసన్ హోల్డర్ 3 వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్య 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.(IPL2022 SH Vs LSG)
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ దీపక్ హుడా హాఫ్ సెంచరీలతో రాణించారు.
ICC CEO : ఒలింపిక్స్‌లో క్రికెట్.. సంపాదన కోసం కాదన్న ICC సీఈవో
ఓపెనర్ గా వచ్చిన రాహుల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 68 పరుగులు చేయగా, వేగంగా ఆడిన దీపక్ హుడా 33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 51 పరుగులు సాధించాడు. యువ బ్యాట్స్ మన్ ఆయుష్ బదోని 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు.
అంతకుముందు, ఓపెనర్ క్వింటన్ డికాక్ 1, ఎవిన్ లూయిస్ 1 పరుగుకే ఔట్ అయ్యి నిరాశపరిచారు. మనీష్ పాండే 11, కృనాల్ పాండ్య 6, జాసన్ హోల్డర్ 8 (నాటౌట్) పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు ఆరంభంలోనే హైదరాబాద్ బౌలర్లు వరుస షాకులిచ్చారు. దీంతో పవర్ ప్లేలోనే లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీలతో రాణించడంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.(IPL2022 SH Vs LSG)
మెగా టోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడిన లక్నో జట్టు.. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఆ తర్వాత చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. తాజాగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లోనూ విక్టరీ కొట్టింది. మరోవైపు, రాజస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో పరాజయం పాలైన హైదరాబాద్ జట్టు.. ఈ మ్యాచులోనైనా బోణీ కొట్టలేదు. మరోసారి నిరాశపరిచింది. వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. కాగా, రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెత్త బౌలింగ్, చెత్త బ్యాటింగ్ తో ఓటమిని కొని తెచ్చుకుంది హైదరాబాద్. లక్నో జట్టుతో పోరులో చివరల్లో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
IPl 2022 : గుజరాత్-ఢిల్లీ మ్యాచ్‌లో ట్విస్ట్.. లలిత్ యాదవ్ ఎలా రనౌట్ అయ్యాడంటే?
లక్నో తో మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు మంచి ప్రదర్శన కనబరిచారు. రాజస్తాన్ తో మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న సన్ రైజర్స్.. లక్నోతో మ్యాచ్ లో మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. వాషింగ్టన్ సుందర్, నటరాజన్, రొమారియో షెపర్డ్ తలా రెండు వికెట్లతో మెరవడంతో లక్నో జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది.
తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే హైదరాబాద్ బరిలోకి దిగింది. లక్నో మాత్రం ఒక మార్పు చేసింది. గత మ్యాచ్ లో విఫలమైన చమీర స్థానంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు. గత సీజన్ లో జేసన్ హోల్డర్ సన్ రైజర్స్ కు ఆడటం విశేషం.
తుది జట్ల వివరాలు..
హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమెరియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
లఖ్‌నవూ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, ఆండ్రూ టై, అవేశ్ ఖాన్