దడ పుట్టించాడు: వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బూమ్రా

  • Published By: vamsi ,Published On : February 3, 2020 / 07:56 AM IST
దడ పుట్టించాడు: వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బూమ్రా

Updated On : February 3, 2020 / 7:56 AM IST

కివీస్ గడ్డపై డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు బుమ్రా న్యూజిలాండ్ ఆటగాళ్లకు దడపుట్టించాడు. టీ20ల్లో కీవీస్ ఆటగాళ్లను కట్టడి చెయ్యడంలో ప్రముఖంగా వ్యవహరించారు బూమ్రా. ఈ క్రమంలోనే బూమ్రా ఓ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో అత్యధిక మెయిడిన్‌ ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డు లిఖించాడు బుమ్రా. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐదో మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించడంతో పాటు 12 పరుగులే ఇచ్చి ఒక మెయిడిన్‌ ఓవర్‌ను సంధించాడు.

దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌లో ఏడవ మెయిడెన్ ఓవర్‌ను నమోదు చేసుకున్నాడు. దీంతో బుమ్రా అత్యధిక టీ20 మెయిడిన్‌ ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డుకు ఎక్కాడు. శ్రీలంక బౌలర్‌ నువాన్‌ కులశేఖర అంతకుముందు 58 మ్యాచ్‌లు ఆడి టీ20 కెరీర్‌లో ఆరు మెయిడెన్‌లు చేశాడు. నువాన్‌ కులశేఖర ఆరు మెయిడిన్‌ ఓవర్ల రికార్డును బుమ్రా తన 49వ మ్యాచ్‌లోనే క్రియేట్ చేశాడు. 

కివీస్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేయగా.. బూమ్రా తనదైన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు.