Jasprit Bumrah: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నుండి జస్ప్రీత్ బుమ్రా ఔట్

బుమ్రా వెన్ను గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదు. గాయం నుంచి కోలుకోవటంతో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి రెండు టెస్టులకు బుమ్రాను సెలక్టర్లు ఎంపిక చేస్తారని అందరూ భావించారు. కానీ, బుమ్రా పూర్తిస్థాయిలో టెస్ట్ సిరీస్ నుంచి దూరమయ్యాడు.

Jasprit Bumrah:  ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నుండి జస్ప్రీత్ బుమ్రా ఔట్

Jasprit Bumrah

Updated On : February 10, 2023 / 3:30 PM IST

Jasprit Bumrah: బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సమయంలో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా సిరీస్ నుంచి పూర్తిగా దూరమయ్యాడు. బుమ్రా గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గాయం నయం కావటంతో బెంగళూరులోని ఎన్‌సీఏలో బుమ్రా రిహాబిలిటేషన్‌ పొందుతున్నాడు. ఆసీస్‌తో జరుగబోయే మూడు, నాలుగు టెస్ట్‌లకు బుమ్రాను అందుబాటులో ఉంటాడని, అప్పుడు జట్టులో చోటు కల్పిస్తామని గతంలో బీసీసీఐ తెలిపింది. అయితే తాజాగా పూర్తి సిరీస్ నుంచి బుమ్రాను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు మ్యాచ్ లకు కూడా బుమ్రాను పరిగణలోకి తీసుకోకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Jasprit Bumrah Practice: నెట్స్‌లో చెమటోడ్చుతున్న టీమిండియా బౌలర్ బుమ్రా.. వీడియో చూడండి..

ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడని సమాచారం.  బుమ్రా గాయం నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతను నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాబోయే కాలంలో కీలక సిరీస్‌లు, వన్డే ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో ఆ సమయాల్లో జట్టుకు బుమ్రా సేవలు ఎంతో అవసరం ఈ క్రమంలో ప్రస్తుతం అతన్ని పూర్తిస్థాయిలో కోలుకొనేందుకు అవకాశం ఇచ్చి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నుంచి ఆడించేలా టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు చేతన్‌ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్టర్లు ఆసీస్‌తో మూడు, నాలుగు టెస్ట్‌ల కోసం టీమిండియా జట్టును అతి త్వరలో ప్రకటించనున్నారు. అదేవిధంగా వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు బుమ్రా తన ఫిట్ నెస్ ను నిరూపించుకుంటే వన్డే సిరీస్ కు బుమ్రా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని, లేకుంటే వన్డే సిరీస్ లో కూడా బుమ్రా ఆడటం కష్టమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

India vs Australia Test: సమరం షురూ.. నేటినుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ..

బుమ్రా వెన్ను గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదు. గాయం నుంచి కోలుకోవటంతో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి రెండు టెస్టులకు బుమ్రాను సెలక్టర్లు ఎంపిక చేశారు. తాజాగా ఆ రెండు టెస్టుల్లో కూడా బుమ్రాను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. తొలి టెస్టు సిరీస్‌కు ప్రారంభంకు ముందు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బుమ్రా గురించి నాకు కచ్చితంగా తెలియదని, కానీ అతను ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులు ఆడుతాడని నేను ఆశిస్తున్నానని తెలిపాడు.