Bumarh: షాకింగ్‌.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి బుమ్రా దూరం.. ఎవరిని తీసుకున్నారో తెలుసా?

అయితే, ఆలోగా బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉంది.

Bumarh: షాకింగ్‌.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి బుమ్రా దూరం.. ఎవరిని తీసుకున్నారో తెలుసా?

Jasprit Bumrah

Updated On : February 12, 2025 / 7:54 AM IST

ఛాంపియన్స్‌ ట్రోఫీకి టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను తీసుకుంటారా? తీసుకోరా? అన్న ఉత్కంఠకు తెరపడింది. అతడిని ఈ జట్టులో చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే దక్కింది. అతడు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడడని బీసీసీఐ ప్రకటన చేసింది.

ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా గాయపడ్డ విషయం తెలిసిందే. అతడు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. బుమ్రాకు వెన్ను కింది భాగంలో తగిలిన గాయం తగ్గకపోవడంతో అతడు ట్రోఫీకి దూరమయ్యాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

అతడి స్థానంలో పేసర్‌ హర్షిత్‌ రాణాను టీమ్‌లోకి తీసుకున్నట్లు చెప్పింది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి సైతం 15 మంది సభ్యుల ట్రోఫీ టీమ్‌లోకి ప్రవేశించాడు. ఛాంపియన్స్ ట్రోపీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం కోసం బీసీసీఐ జనవరిలోనే జట్టును ప్రకటించింది. ఆ జాబితాలో టీమిండియాలో బుమ్రా పేరు ఉంది.

Also Read: బంగారం కొంటున్నారా? రేట్లు ఎలాగున్నాయో తెలుసా?

ఆ సమయంలోనూ బుమ్రా ఫిట్‌గా లేనప్పటికీ కోలుకుంటాడని భావించారు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో బుమ్రా డాక్టర్ టీమ్‌ ఆధ్వర్యంలో కోలుకునే ప్రక్రియ ప్రారంభించినప్పటికీ పిట్‌నెస్‌ సాధించకపోవడంతో చివరకు అతడు జట్టుకి దూరమయ్యాడు.

ట్రోఫీ టీమ్‌లో మార్పులు చేసుకోవడానికి నిన్నటితో గడువు ముగిసింది. దీంతో ఎన్‌సీఏ డాక్టర్ల టీమ్‌ బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ నివేదికను అందించింది. బుమ్రా గాయం నుంచి కాస్త కోలుకున్నప్పటికీ ఏ ఇబ్బందీ పడకుండా బౌలింగ్‌ చేయగలడన్న హామీని మాత్రం ఇవ్వలేకపోయింది.

ట్రోఫీలో అతడికి చోటు కల్పించడంపై ఇక సెలెక్టర్లు, టీమ్‌ యాజమాన్యమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీంతో టీమ్‌లో బుమ్రాను ఆడిస్తే అతడిని గాయం మళ్లీ పెరగవచ్చని బీసీసీఐ భావించినట్లు సమాచారం. కాగా, మార్చి 21 నుంచి ఐపీఎల్‌-2025 ప్రారంభం కానుంది. ఆలోగా బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉంది.