MS Dhoni: ధోని ఆడింది 17 బంతులే.. జియో వ్యూస్ మాత్రం రెండున్నర కోట్లు

ఐపీఎల్ -2023 ప్రారంభం నుంచి ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జియో సినిమా యాప్ వ్యూస్ అమాంతం పెరిగిపోతున్నాయి.

MS Dhoni: ధోని ఆడింది 17 బంతులే.. జియో వ్యూస్ మాత్రం రెండున్నర కోట్లు

MS Dhoni

Updated On : April 13, 2023 / 4:16 PM IST

MS Dhoni: టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని (M.S. Dhoni) క్రీజులో ఉంటే ఆ మజానే వేరు. ఇక చివరి ఓవర్లలో క్రీజులో ఉన్నాడంటే క్రికెట్ ప్రియులు టీవీలకు అతక్కుపోతారు. ఎందుకంటే.. ప్రత్యర్థి బౌలర్ ఎంతటి అనుభవజ్ఞుడైనా సిక్సర్ల మోత మోగించడం ధోనీ స్పెషాల్టీ. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీ.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు మ్యాచ్ లు ఆడింది. రెండు మ్యాచ్ లలో ఓటమి పాలవ్వగా.. రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది.

 

MS Dhoni (photo - Chennai Super Kings Twitter)

MS Dhoni (photo – Chennai Super Kings Twitter)బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలుపు అంచుల్లోకి వెళ్లింది. చివరి బంతికి ధోనీ సిక్స్ కొట్టలేక పోవటంతో ఓటమి పాలైంది. ధోనీ క్రీజులోకి వచ్చి ఆడింది 17 బంతులే అయినా 32 పరుగులు చేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను జియో సినిమా యాప్ ఫ్రీగా ప్ర‌సారం చేస్తున్న విష‌యం తెలిసిందే. ధోని క్రీజులోకి రాకముందు జియో సినిమా యాప్ వ్యూస్ 60లక్షల దగ్గర ఉన్నాయి. ధోనీ క్రీజులోకి రాగానే అమాంతం పెరిగాయి. జడేజాతో కలిసి జట్టును గెలిపించే ప్రయత్నంలో చివరి ఓవర్లలో ధోనీ మూడు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. ఆఖరి రెండు ఓవర్లలో ధోనీ క్రీజులో ఉండటంతో జియో సినిమా యాప్ వ్యూస్ 2.2కోట్లకు చేరుకున్నాయి. ఇది జియో సినిమా యాప్‌కు ఆల్ టైమ్ రికార్డు.

 

MS Dhoni (photo - Chennai Super Kings Twitter)

MS Dhoni (photo – Chennai Super Kings Twitter)

ఐపీఎల్ -2023 ప్రారంభం నుంచి ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జియో సినిమా యాప్ వ్యూస్ అమాంతం పెరిగిపోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 1.7 కోట్ల మంది ప్రేక్షకులు జియో సినిమా యాప్‌లో మ్యాచ్ వీక్షించారు. ఆర్సీబీ- ల‌క్నో మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో 1.8 ల‌క్ష‌ల మంది వీక్షించారు. తాజాగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ క్రీజులో వచ్చిన తరువాత జియో సినిమా యాప్ వ్యూస్ 2.2 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు ఆల్ టైం రికార్డు.