IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కి జియో గుడ్‌న్యూస్.. ఫ్రీగా ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇలా చేయండి..
ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో 90 రోజుల పాటు ఉచితంగా యాక్సెస్‌ను అందుకోవచ్చు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఓ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లతో 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందుకోవచ్చు. దీంతో యూజర్లు మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. అంతేగాక, ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ డేటా, ఇతర ప్రయోజనాలనూ అందుకోవచ్చు.
రూ.299 ప్లాన్
జియో రూ. 299తో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. అదనంగా ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఐపీఎల్ చూడాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చింది.
- బెనిఫిట్స్
- 28 రోజుల పాటు చెల్లుతుంది
- రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటా పొందవచ్చు
- దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు
- యూజర్లు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందుతారు
- ఐపీఎల్ 2025, ఇతర ప్రీమియం కంటెంట్ కోసం రీఛార్జ్‌తో 90 రోజుల పాటు ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది
- అదనపు ప్రయోజనాలు: జియోటీవీ, జియోక్లౌడ్ యాప్‌లకు ఉచిత యాక్సెస్
ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే మరిన్ని ప్లాన్‌లు కూడా ఉన్నాయి. రూ. 299 ప్లాన్‌తో పాటు, జియో మరో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో 90 రోజుల పాటు ఉచితంగా యాక్సెస్‌ను అందుకోవచ్చు.
రూ. 349 ప్లాన్
- 28 రోజుల పాటు చెల్లుబాటు
- 2జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటా
- అపరిమిత వాయిస్ కాలింగ్
- 28 రోజుల పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు
- 90 రోజుల పాటు జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ యాక్సెస్‌తో ఉచిత జియోస్టార్ సబ్‌స్క్రిప్షన్
రూ. 899 ప్లాన్
- 90 రోజుల చెల్లుబాటు
- ఇది 2జీబీ రోజువారీ డేటాతో పాటు 20జీబీ అదనపు డేటాతో వస్తుంది
- అన్‌లిమిటెడ్ 5జీ డేటా అందుకోవచ్చు
- అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందుకోవచ్చు
- రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు
- 90 రోజుల పాటు జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ యాక్సెస్‌తో ఉచిత జియోస్టార్ సబ్‌స్క్రిప్షన్ అందుకోవచ్చు
ఐపీఎల్ 2025లో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూడాలనుకునేవారికి జియో అందిస్తున్న ఈ ప్లాన్లను గొప్ప ఆఫర్లుగానే చెప్పుకోవచ్చు. ఏదైనా ప్లాన్‌లతో రీఛార్జ్ చేసిన తర్వాత యూజర్లు తమ జియో మొబైల్ నంబర్‌తో జియోహాట్‌స్టార్ యాప్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా వారి ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది యాక్టివేషన్ చేసిన రోజు నుంచి 90 రోజుల వరకు పనిచేస్తుంది.