క్షమించమంటోన్న లంక కెప్టెన్ కరుణరత్నే

లంక జట్టు టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె క్షమాభిక్ష పెట్టమంటూ అభ్యర్థిస్తున్నాడు. కొలంబోలో తాగి వాహనం నడుపుతూ ఓ వ్యక్తిని గుద్దాడు.

క్షమించమంటోన్న లంక కెప్టెన్ కరుణరత్నే

Updated On : April 2, 2019 / 9:42 AM IST

లంక జట్టు టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె క్షమాభిక్ష పెట్టమంటూ అభ్యర్థిస్తున్నాడు. కొలంబోలో తాగి వాహనం నడుపుతూ ఓ వ్యక్తిని గుద్దాడు.

లంక జట్టు టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె క్షమాభిక్ష పెట్టమంటూ అభ్యర్థిస్తున్నాడు. కొలంబోలో తాగి వాహనం నడుపుతూ ఓ వ్యక్తిని గుద్దాడు. అతని తీవ్రగాయాలవడంతో ఆదివారం అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. యాక్సిడెంట్‌కు గురైన వ్యక్తి చికిత్సానంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఆ తర్వాత కరుణరత్నె కూడా బెయిల్ మీద విడుదల అయ్యాడు. 

ఈ విషయంపై మాట్లాడిన కరుణరత్నె..’ముందుగా ప్రమాదానికి గురైన వాహనం డ్రైవర్‌ను క్షమాపణ అడుగుతున్నాను. గాయాలైనప్పటికీ అతను నా పట్ల చాలా హుందాగా ప్రవర్తించాడు. ప్రమాదం లేదని చెప్పడంతో అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు’

‘నేనే స్వయంగా కోర్టుకెళ్లి ఘటన గురించి వివరించాను. లీగల్‌గా జరగాల్సిన వాటికి అనుగుణంగా నడుచుకుంటాను. శ్రీలంక జాతీయ జట్టు ప్లేయర్‌గా నాకేం చేయాలో తెలుసు. ఈ ఘటన పట్ల అందరినీ క్షమాపణ అడుగుతున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశాడు కరుణరత్నె. ఇతని కెప్టెన్సీలో లంక జట్టు దక్షిణాప్రికాపై గెలిచిన తొలి ఆసియా జట్టుగా గత నెలలో రికార్డు సృష్టించింది. 
Read Also : RR vs RCB: మ్యాచ్ గెలిచేదెవరు.. బోణీ కొట్టేదెవరు.. ?