ఐపీఎల్ 150వికెట్లు పడగొట్టిన భారత రెండో బౌలర్

ఐపీఎల్‌లో భాగంగా ఏప్రిల్ 28 ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రతిభ చూపించి జట్టుకు అసాధారణమైన స్కోరు తెచ్చిపెట్టారు ఆండ్రీ రస్సెల్, హార్దిక్ పాండ్యా. వీరితో పాటు ఇదే మ్యాచ్‌లో మరో ప్లేయర్ ప్రత్యేకమైన ఘనత సాధించాడు.
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో 150వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. టీమిండియా వెటరన్ ప్లేయర్ పీయూశ్ చావ్లా ముంబై ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాను అవుట్ చేసి ఈ జాబితాలోకి అడుగుపెట్టాడు. తానే బౌలింగ్ వేసి క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ వికెట్ చేజిక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి చావ్లా 156మ్యాచ్‌ల సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ జాబితాలో పీయూశ్ చావ్లా కంటే ముందు లసిత్ మలింగ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు.
మ్యాచ్‌లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా భారీ టార్గెట్ నిర్దేశించింది. 233 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఒత్తిడికి లోనై వికెట్లను చేజార్చుకుంది. వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేస్తూ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు హార్దిక్ పాండ్యా. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. 34 బంతుల్లో 91 పరుగులు చేయగలిగాడు. చివరికి నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్లు నష్టపోయి 198 పరుగులు మాత్రమే చేసి 34 పరుగుల తేడాతో ఓటమికి గురైంది.