KKRvsRCB: ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు 2వ విజయం

ఐపీఎల్లో బెంగళూరు 2వ విజయం నమోదు చేసుకుంది. కోల్‌కతాతో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు.
ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లలో ఇంకా 10 పరుగులు చేయాల్సి ఉండడంతో బెంగళూరుకు విజయం చేజిక్కింది. ఈ గేమ్ లోనూ ఆండ్రీ రస్సెల్ మెరుపులు కురిపించాడు. ఆరో వికెట్ గా బరిలోకి దిగిన రస్సెల్(65; 25బంతుల్లో 2ఫోర్లు, 9సిక్సులు)తో చెలరేగాడు. అతనికి తోడుగా నితీశ్ రానా(85; 46 బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సులు) నిలవడంతో టార్గెట్ చేధించగలరన్నంత నమ్మకం వచ్చింది.
ఈ దశలో బౌలింగ్ తీసుకున్న స్టోనిస్, మొయిన్ అలీలు భారీగా కట్టడి చేశారు. వారిద్దరూ మినహాయించి కోల్‌కతా బ్యాట్స్ మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. క్రిస్ లిన్(1), సునీల్ నరైన్(18), శుభ్ మాన్ గిల్(9), రాబిన్ ఊతప్ప(9), దినేశ్ కార్తీక్(0)పరుగులు మాత్రమే చేయగలిగారు.
అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు కోల్‌కతాపై విజృంభించింది. ఐపీఎల్ సీజన్ 12లో తొలిసారి మెరుపులు సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 4 వికెట్లు నష్టపోయి కోల్‌కతాకు 214 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది.
బెంగళూరు జట్టు స్కోరులో కోహ్లీ(100; 58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సులు), మొయిన్ అలీ(66; 28 బంతుల్లో 5 ఫోర్లు, 6సిక్సులు)తో విజృంభించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరో ఓపెనర్ పార్థివ్ పటేల్(11), అక్షదీప్ నాథ్(13), మార్కస్ స్టోనిస్(17)పరుగులు చేశారు.