ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. గిల్ టాప్.. సెంచరీతో పైకొచ్చిన కోహ్లీ.. చెక్ ఫుల్ లిస్ట్

ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు.

ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. గిల్ టాప్.. సెంచరీతో పైకొచ్చిన కోహ్లీ.. చెక్ ఫుల్ లిస్ట్

Kohli

Updated On : February 26, 2025 / 4:59 PM IST

దుబాయ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ (100 నాటౌట్‌) అజేయ శ‌త‌కంతో చెల‌రేగాడు. ఈ క్ర‌మంలో తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన వ‌న్డే ర్యాంక్సింగ్స్‌లో కోహ్లీ దూసుకువెళ్లాడు. ఓ స్థానం మెరుగుప‌ర‌చుకుని ఐదో ర్యాంక్స్‌కు చేరుకున్నాడు.

ఇక టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ త‌న అగ్ర‌స్థానాన్ని కాపాడుకున్నాడు. అటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సైతం మూడో ర్యాంక్‌లోనే కొన‌సాగుతున్నాడు. వీరితో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్ సైతం టాప్‌-10లో ఉన్నాడు. 679 రేటింగ్ పాయింట్ల‌తో అయ్య‌ర్ 9వ స్థానంలో ఉన్నాడు. ఇక పాక్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజాం రెండో స్థానంలోనే ఉన్నాడు.

Wasim Akram wife : ‘డివోర్స్డ్ XI’ పోస్ట్ పై వ‌సీం అక్ర‌మ్ భార్య ఆగ్ర‌హం.. లిస్ట్‌లో ధావ‌న్‌, ర‌విశాస్త్రి, హార్దిక్ పాండ్యా..

వ‌న్డేల్లో బ్యాటింగ్‌లో టాప్‌-5 ర్యాంకింగ్స్‌లో ఉన్న ఆట‌గాళ్లు..

శుభ్‌మ‌న్ గిల్ (భార‌త్‌) – 817 రేటింగ్ పాయింట్లు
బాబ‌ర్ ఆజాం (పాకిస్తాన్‌) – 770 రేటింగ్ పాయింట్లు
రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 757 రేటింగ్ పాయింట్లు
హెన్రిచ్ క్లాసెన్ (ద‌క్షిణాఫ్రికా) – 749 రేటింగ్ పాయింట్లు
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 743 రేటింగ్ పాయింట్లు

అటు బౌలింగ్‌లో దాదాపుగా మార్పులు లేవు. శ్రీలంక స్పిన్న‌ర్ మ‌హేశ్ తీక్ష‌ణ తొలి స్థానంలో ఉండ‌గా, అఫ్గానిస్తాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ రెండు, భార‌త స్టార్ కుల్దీప్ యాద‌వ్ మూడో స్థానంలోనే కొన‌సాగుతున్నాడు. కుల్దీప్ మినహా మ‌రే భార‌త బౌల‌ర్ టాప్‌-10లో లేడు.

KL Rahul : ఎంత మాట‌న్నావ్ రాహుల్‌.. విరాట్ కోహ్లీ, ధోనీలు కాదా.. ఆ విష‌యంలో రోహిత్ శర్మే తోపా?

వ‌న్డేల్లో బౌలింగ్‌లో టాప్‌-5 ర్యాంకింగ్స్‌లో ఉన్న ఆట‌గాళ్లు..

మ‌హేశ్ తీక్ష‌ణ (శ్రీలంక‌) – 680 రేటింగ్ పాయింట్లు
ర‌షీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) – 658 రేటింగ్ పాయింట్లు
కుల్దీప్ యాద‌వ్ (భార‌త్‌) – 656 రేటింగ్ పాయింట్లు
కేశ‌వ్ మ‌హ‌రాజ్ (ద‌క్షిణాఫ్రికా) – 641 రేటింగ్ పాయింట్లు
బెర్నార్డ్ స్కోల్ట్జ్ (న‌మీబియా) – 641 రేటింగ్ పాయింట్లు.