IPL 2025: ఐపీఎల్ టోర్నీ ప్రారంభంవేళ.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌..! ఇవాళ్టి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రద్దవుతుందా..?

ఐపీఎల్ -2025 టోర్నీ ఇవాళ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య జరుగుతుంది.

IPL 2025: ఐపీఎల్ టోర్నీ ప్రారంభంవేళ.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌..! ఇవాళ్టి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రద్దవుతుందా..?

IPL 2025

Updated On : March 22, 2025 / 8:06 AM IST

IPL 2025: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ పండుగ మొదలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2025) 18వ సీజన్ ప్రారంభానికి సర్వం సన్నద్ధమైంది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతా వేధికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా..? అనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతుంది.

Also Read: IPL 2025 టైటిల్ గెలిచేది ఎవరు? Grok చెప్పిందిదే..

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మైదానం గణాంకాలు పరిశీలిస్తే.. ఇక్కడ ఛేజింగ్ చేసే జట్టు ఎక్కువ విజయాలు సాధించింది. కోల్‌కతా మైదానం అధిక స్కోరింగ్ మ్యాచ్ లకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో 93 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి.. ఛేజింగ్ జట్టు 55 సార్లు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 38సార్లు గెలిచింది.

Also Read: Chahal Video: విడాకులు తీసుకునే వేళ క్రికెటర్ చాహల్‌, ధనశ్రీ వర్మ కోర్టుకు ఎలా వచ్చారో చూడండి..

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కోసం ఎంతో ఉత్సాహంగా సిద్ధమవుతున్న అభిమానులకు వరుణుడు ఆందోళన కలిగిస్తున్నాడు. ఇవాళ (శనివారం) కోల్ కతాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయి. శుక్రవారం కూడా వర్షం కారణంగా కోల్ కతా, బెంగళూరు జట్ల ఆటగాళ్ల ప్రాక్టీస్ కు అంతరాయం కలిగింది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.

IPL 2025

వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శనివారం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం కొంత ఎండ ఉండవచ్చు. కానీ, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడే అవకాశం ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ వర్షం పలుసార్లు అంతరాయం కలిగించే అవకాశం ఉంటుంది. భారీ వర్షం కురిసే అవకాశాలూ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే జరిగితే మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.