IPL 2023, SRH vs KKR: ఉప్ప‌ల్‌లో హైద‌రాబాద్‌కు మ‌రో ఓట‌మి.. కోల్‌క‌తా గెలుపు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ఉప్ప‌ల్ వేదికగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad)తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్(Kolkata Knight Riders) 5 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

IPL 2023, SRH vs KKR: ఉప్ప‌ల్‌లో హైద‌రాబాద్‌కు మ‌రో ఓట‌మి.. కోల్‌క‌తా గెలుపు

kkr win (pic ipl twitter)

Updated On : May 4, 2023 / 11:32 PM IST

IPL 2023, SRH vs KKR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ఉప్ప‌ల్ వేదికగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad)తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్(Kolkata Knight Riders) 5 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ల‌క్ష్యఛేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యానికి 9 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. మొద‌టి రెండు బంతుల‌కు రెండు ప‌రుగులు రాగా.. మూడో బంతికి అబ్దుల్ స‌మ‌ద్ ఔట్ అయ్యాడు. మిగిలిన మూడు బంతుల్లో ఒకే ప‌రుగు వ‌చ్చింది.

IPL 2023, SRH vs KKR: ఉత్కంఠ పోరులో స‌న్‌రైజ‌ర్స్‌పై కోల్‌క‌తా విజ‌యం

స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో మార్‌క్ర‌మ్‌(41; 40 బంతుల్లో 4 ఫోర్లు), క్లాసెన్‌(36; 20 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు), రాహుల్ త్రిపాఠి(20; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), అబ్దుల్ స‌మ‌ద్‌(21; 18 బంతుల్లో 3 ఫోర్లు) లు రాణించారు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ లు చెరో రెండు వికెట్లు తీయ‌గా హర్షిత్ రాణా, ఆండ్రీ ర‌స్సెల్‌, అనుకుల్ రాయ్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

Virat Kohli: గంభీర్‌తో గొడ‌వ.. మ‌రుస‌టి రోజు భార్య‌తో క‌లిసి విరాట్ ఏం చేశాడంటే..?

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో రింకూ సింగ్‌(46; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్ రాణా(42; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించ‌గా ఆండ్రీ ర‌స్సెల్‌(24; 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) ప‌ర్వాలేద‌నిపించాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్, న‌ట‌రాజ‌న్‌లు చెరో రెండు వికెట్లు తీయ‌గా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, కార్తీక్ త్యాగి, మార్‌క్ర‌మ్‌, మ‌యాంక్ మార్కండే ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.