KS Bharat : శ్రీరాముడికి సెంచరీని అంకితం ఇచ్చిన భరత్.. సెలబ్రేషన్స్ వీడియో వైరల్
టీమ్ఇండియా వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ తన సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు.

KS Bharat dedicates century to Lord Ram
KS Bharat dedicates century to Lord Ram : టీమ్ఇండియా వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ ఫామ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికార టెస్టు సిరీస్‌లో 490 పరుగుల లక్ష్య ఛేదనలో భరత్ అజేయ సెంచరీతో రాణించాడు. కాగా.. ఈ సెంచరీని భరత్ శ్రీరాముడికి అంకితం చేయడం విశేషం. భరత్ సెంచరీ చేసినప్పటికీ భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించలేదు. అయితే.. మ్యాచ్ డ్రా ముగిసింది.
ఈ మ్యాచ్‌లో సెంచరి పూర్తి కాగానే భరత్ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భరత్ విల్లును ఎక్కుపెడుతూ.. సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రాముడి పట్ల భక్తిని ప్రదర్శిస్తూ ఆ భగవంతుడికి తన శతకాన్ని అంకితం ఇస్తూ భరత్ ఇలా చేశాడు.
ఇదిలా ఉంటే.. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ లయన్స్ ఎనిమిది వికెట్లు నష్టపోయి 553 పరుగులు చేసింది. జెన్నింగ్స్ (154; 188 బంతుల్లో 20 ఫోర్లు, 2సిక్సర్లు), జోష్ బోహన్నన్ (125; 182 బంతుల్లో 14 ఫోర్లు, 1సిక్స్) శతకాలతో కదం తొక్కగా అలెక్స్ (73), మౌస్లీ (68), జాక్ కార్‌సన్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్ లయన్స్ భారీ స్కోరు చేసింది. అనంతరం రజత్ పటీదార్ (151; 158 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం సాధించినప్పటికీ మిగిలిన వారు విఫలం కావడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌కు 326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఆతరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ లయన్స్ జెన్నింగ్స్ (64), జేమ్స్ (56) అర్ధశతకాలు బాదడంతో 163/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 490 పరుగుల భారీ విజయలక్ష్యం నిలిచింది. కేఎస్ భరత్ అజేయ శతకం చేయడం.. సాయి సుదర్శన్ (97), సర్ఫరాజ్ ఖాన్ (55) హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్-ఏ ఐదు వికెట్లు కోల్పోయి 426 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
కాగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన జనవరి 25 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌కు భరత్ వికెట్ కీపర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భరత్ ఫామ్ అందుకోవడం శుభ పరిణామం
Rohit Sharma : ధోనిదా, సెహ్వాగ్‌దా?.. ఈ ఇద్దరిలో రోహిత్ శర్మ ఎవరి రికార్డు బద్దలు కొడతాడో..!
KS Bharat dedicated his hundred against England Lions to “Lord Ram”.
– Bharat did bow & arrow celebration…!!!!pic.twitter.com/B13stcQBu7
— Johns. (@CricCrazyJohns) January 21, 2024