AFG vs SL : అఫ్గానిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో అనూహ్య ఘటన..
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంక, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య పూణె వేదికగా మ్యాచ్ జరుగుతోంది.

kid faints during national anthems in AFG vs SL match
Afghanistan vs Sri Lanka : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంక, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య పూణె వేదికగా మ్యాచ్ జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆటగాళ్లు జాతీయ గీతం ఆలపిస్తుండగా ఓ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. శ్రీలంక జాతీయ గీతం ఆలపిస్తుండగా కుశాల్ మెండీస్ ముందు నిలబడిన బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మెండీస్ ఆ బాలుడిని పట్టుకున్నాడు.
సిబ్బందిలో ఒకరు వచ్చి ఆ బాలుడి అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. కాగా.. పూణెలో అధిక ఉష్ణోగ్రత ఉండడంతో ఆ బాలుడు స్పృహ తప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
— rajendra tikyani (@Rspt1503) October 30, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. నిస్సాంక 46, కుశాల్ మెండిస్ 39, సమరవిక్రమ 36, మహేశ్ తీక్షణ 29, ఏంజెలో మాథ్యూస్ 23, అసలంక 22, కరుణరత్నే 15 పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫజల్హా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముజీబ్ రెండు వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒక్కొ వికెట్ సాధించారు.
Rachin Ravindra : ఆసీస్ పై రచిన్ రవీంద్ర సెంచరీ.. అతడి ప్రియురాలి పోస్ట్ వైరల్