క్యాబే గాం.. చాహల్‌ను గఫ్తిల్ తిట్టాడా!!

క్యాబే గాం.. చాహల్‌ను గఫ్తిల్ తిట్టాడా!!

Updated On : January 27, 2020 / 8:18 AM IST

న్యూజిలాండ్ గడ్డపై పర్యాటక జట్టు భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌తో 2-0ఆధిక్యానికి చేరింది టీమిండియా. తొలి టీ20లో 204పరుగుల లక్ష్యాన్ని చేధించిన కోహ్లీసేన.. రెండో టీ20లోనూ స్వల్ప లక్ష్యమైన 133పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించేశారు. సిరీస్ చేజిక్కించుకోవడానికి ఒక్క మ్యాచ్ గెలిస్తేచాలు. 

ఇదిలా ఉంటే, మ్యాచ్‌ ముగిసిన తర్వాత చాహల్ టీవీ అంటూ ఇంటర్వ్యూకు బయల్దేరిన ఈ స్పిన్నర్ కు పరాభవమే ఎదురైంది. న్యూస్ చానెల్ యాంకర్ తో మాట్లాడిన చాహల్ అతని దగ్గర్నుంచి మైక్ తీసుకుని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. కివీస్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గఫ్తిల్‌ మాట్లాడుకుంటుంటే మద్యలో దూరాడు. 

అప్పటికే వారిద్దరి మధ్య ఫన్నీ సంభాషణ జరుగుతుండగా రోహిత్.. గఫ్తిల్‌ను క్యాబే గాం.. అనమన్నాడు. చాహల్ వచ్చి పలకరించగానే గఫ్తిల్ క్యాబే ..డు అన్నాడు. పాపం చాహల్.. లైట్ తీసుకుని నవ్వుకుని ఊరుకున్నాడు. అది విన్నరోహిత్ శర్మ మాత్రం పడిపడి నవ్వుకున్నాడు. చేసేది లేక చాహల్ ఇక గుప్తాజీ అనుకుంటూ సంభాషణను పొడిగించాడు. 

శ్రేయాస్-రాహుల్ లు విజృంభించి భారత్‌కు విజయాన్ని తెచ్చిపెట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 5వికెట్ల నష్టానికి 132పరుగులు చేసింది. మార్టిన్ గఫ్తిల్.. టిమ్ సీఫెర్ట్ మాత్రం 30పరుగులకు మించిన స్కోరు చేయగలిగారు. చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు శ్రేయాస్.. రాహుల్. మూడో టీ20ని హామిల్టన్ లోని సెడన్ పార్క్ వేదికగా ఆడనున్నాయి ఇరు జట్లు.