Lionel Messi: ధోనీ కూతురికి లియోనెల్ మెస్సీ బహుమతి.. ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీ అందించిన ఫుట్‌బాల్ లెజెండ్

మెస్సీ స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన అర్జెంటినా జెర్సీని ధోనీ కూతురు జివాకు అందించాడు. ఈ విషయాన్ని జివా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధోనీ వెల్లడించాడు. జివా జెర్సీ ధరించిన ఫొటోల్ని కూడా షేర్ చేశారు.

Lionel Messi: ధోనీ కూతురికి లియోనెల్ మెస్సీ బహుమతి.. ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీ అందించిన ఫుట్‌బాల్ లెజెండ్

Updated On : December 28, 2022 / 11:02 AM IST

Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్, అర్జెంటినా ఆటగాడు లియోనెల్ మెస్సీ.. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ధోనీ కూతురుకు బహుమతి అందించాడు. మెస్సీ స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన అర్జెంటినా జెర్సీని ధోనీ కూతురు జివాకు అందించాడు. ఈ విషయాన్ని జివా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధోనీ వెల్లడించాడు.

Police Recruitment: గర్భిణి అభ్యర్థులకు శుభవార్త.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే మెయిన్స్ పరీక్షకు అనుమతి

జివా జెర్సీ ధరించిన ఫొటోల్ని కూడా షేర్ చేశారు. మెస్సీ గిఫ్ట్ ఇచ్చిన జెర్సీ ధరించిన జివా మురిసిపోతూ, ఫొటోలో కనిపిస్తోంది. జివా సింగ్ ధోని పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోల్ని షేర్ చేశారు. ఈ జెర్సీపై మెస్సీ.. ‘పారా జివా’ అని కూడా రాశాడు. అంటే ‘ఫర్ జివా’ అని అర్థం. కొద్ది రోజుల క్రితం బీసీసీఐ సెక్రటరీ జై షాకు కూడా మెస్సీ ఒక జెర్సీ పంపించినట్లు సమాచారం. తాను ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని మెస్సీ, జైషాకు పంపించాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ఓఝా వెల్లడించాడు. ధోనికి ఫుట్‌బాల్ అన్నా కూడా చాలా ఇష్టం. తీరిక సమయాల్లో ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడేందుకు ఇష్టపడతాడు ధోని.

ఆయన నుంచి జివాకు కూడా ఫుట్‌బాల్ అంటే ఇష్టం పెరిగింది. ఇటీవలి ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటినా గెలవడంతో లియోనెల్ మెస్సీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ఆయనకు అర్జెంటినాలోనే కాకుండా, అనేక దేశాల్లో అభిమానులున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni)