మెస్సీ vs ధోనీ, కోహ్లీ: ముంబైలో డ్రీమ్ మ్యాచ్? సచిన్, రోహిత్ శర్మ వంటి ఇతర దిగ్గజ క్రికెటర్లు కూడా..

MCA వర్గాలు ఏమంటున్నాయి? మెస్సీ భారత పర్యటన వివరాలు  

మెస్సీ vs ధోనీ, కోహ్లీ: ముంబైలో డ్రీమ్ మ్యాచ్? సచిన్, రోహిత్ శర్మ వంటి ఇతర దిగ్గజ క్రికెటర్లు కూడా..

Lionel Messi, MS Dhoni, Virat Kohli

Updated On : August 1, 2025 / 9:42 PM IST

ఫుట్‌బాల్ రంగంలో సంచలనం సృష్టించిన లియోనెల్ మెస్సీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టనున్నాడా? ప్లాన్ ప్రకారం అంతా ఓకే అయితే ఈ ఏడాది డిసెంబర్ 14న ముంబైలోని వాంఖడే స్టేడియంలో మెస్సీ.. భారత క్రికెట్ దిగ్గజాలు ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీతో క్రికెట్ మ్యాచ్‌లో తలపడే అవకాశం ఉంది. ఇది ఫుట్‌బాల్, క్రికెట్ అభిమానులకు పండుగలాంటి వార్త.

మెస్సీ vs ధోనీ, కోహ్లీ: ముంబైలో డ్రీమ్ మ్యాచ్?
మెస్సీ తన ప్రమోషనల్ టూర్‌లో భాగంగా డిసెంబర్ 14న ముంబైని సందర్శించనున్న వేళ వాంఖడే స్టేడియంలో ఒక ప్రత్యేకమైన క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించడానికి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు ఒక ప్రముఖ ఈవెంట్ ఏజెన్సీ అభ్యర్థన సమర్పించింది. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి ఇతర దిగ్గజ క్రికెటర్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన లాజిస్టిక్స్‌ను ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read: వైరల్ వీడియో.. అందరి హృదయాలను గెలిచిన ఏనుగు పిల్ల.. ప్రేమతో ఏం చేసిందో చూడాల్సిందే..

MCA వర్గాలు ఏమంటున్నాయి?
“మెస్సీ డిసెంబర్ 14న వాంఖడే స్టేడియంలో ఉంటారు. ఆయన మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. అన్ని వివరాలు ఖరారైన తర్వాత, నిర్వాహకులు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తారు” అని MCA వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

మెస్సీ భారత పర్యటన వివరాలు
మెస్సీ డిసెంబర్ 13 నుంచి 15 వరకు భారత్‌లో పర్యటిస్తాడు. న్యూఢిల్లీ, కోల్‌కతాలను కూడా సందర్శించనున్నాడు. గతంలో, 2011లో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజువెలాతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు అతడు భారత్‌కు వచ్చారు.