West Indies: ఆ వన్డే ప్రపంచకప్‌ను భారత్ ఏదో లక్కీగా గెలుచుకుంది.. లేదంటే..: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
ఆ ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో తాము ఫాంలోనే ఉన్నామని, అయినప్పటికీ ఓడిపోయామని ఆండీ రాబర్ట్స్ అన్నారు.

World Cup in 1983
West Indies – Andy Roberts: వెస్టిండీస్ మాజీ పేసర్ ఆండీ రాబర్ట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డే ప్రపంచ కప్ -1983 (World Cup in 1983) ఫైనల్లో వెస్టిండీస్ ను ఓడించి భారత్ (India) కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ వన్డే ప్రపంచకప్‌ను భారత్ ఏదో లక్కీగా గెలుచుకుందని ఆండీ రాబర్ట్స్ చెప్పుకొచ్చారు.
ఆ ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో తాము ఫాంలోనే ఉన్నామని, అయినప్పటికీ ఓడిపోయామని ఆండీ రాబర్ట్స్ అన్నారు. తమది చాలా గొప్ప జట్టని, అయినప్పటికీ ఆ ప్రపంచ కప్ లో భారత్ చేతిలో రెండు సార్లు ఓడిపోయామని చెప్పారు. ఆ తర్వాత అయిదారు నెలల తర్వాతే భారత్ ను 6-0 తేడాతో ఓ వన్డే సిరీస్ లో ఓడించామని తెలిపారు.
భారత్ ను 183 పరుగులకే ఆలౌట్ చేశామని, ఆ తర్వాత బౌలింగ్ లో భారత్ కు అదృష్టం కలిసి వచ్చిందని, ఆ జట్టే గెలిచిందని చెప్పుకొచ్చారు. తమది భారత్ కన్నా బలహీన జట్టేం కాదని అన్నారు. ఫైనల్లో ఒక్క బ్యాటర్ కూడా కనీసం అర్ధ సెంచరీ చేయలేకపోయాడని చెప్పారు.
ఆ మ్యాచులో ఒక్క బౌలర్ కూడా 5 వికెట్లు పడగొట్టలేదని, కనీసం 4 వికెట్లూ దక్కించుకోలేకపోయాడని అన్నారు. ప్రత్యేకంగా ఆకట్టుకున్న ఆటగాడు ఎవరూ లేరని చెప్పారు. మంచి ఇన్నింగ్స్ ఆడితే బ్యాటర్ అందరికీ ఆకట్టుకుంటాడని, భారత్ నుంచి అటువంటి ప్రదర్శన ఎవరూ ఇవ్వలేకపోయారని చెప్పుకొచ్చాడు.